ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ గత కొద్దీ కాలంగా రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పలు విద్యార్ధి సంఘాలు తాడేపల్లి లోని సీఎం జగన్ ఇంటి వద్ద ఆందోళనలు చేసారు. ఇదే విషయం పై మరోసారి విద్యార్ధి సంఘాలతో పాటు టీడీపీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా టీడీపీ నేత నారా లోకేష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ గోవేర్నమేంట్ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి, రాష్ట్రం లోని యువతని పూర్తిగా మర్చిపోయిందని విమర్శించారు. ఈ సందర్బంగా కొత్త జాబ్ కేలండర్ ని విడుదల చెయ్యాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈరోజు ఉదయం సీఎం నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. అక్రమ అరెస్ట్లకి, నిర్బంధాలకి భయపడకుండా ఎదురు నిలబడిన యువత ని ఈ సందర్బంగా మెచ్చుకున్నారు. ఉద్యోగ పోరాట సమితి డిమాండ్లని పరిష్కరించక పోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read:
“మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా..!” అంటూ IND VS SL మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!