ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పూర్వకాలంలో చాలామంది ఆహారం సంపాదించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఆ సమయంలో అనేక కట్టుబాట్లు నీతి, నియమాలు ఉండేవని వాటిని ఇప్పటికీ కూడా కొంతమంది పాటిస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం..? ఈ టెక్నాలజీ యుగంలో డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది.
మరీ ఎక్కువ కాకుండా కనీసం వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు సంపాదిస్తున్నారు. దానితో వాళ్ళు ఇండ్లు కట్టుకొని అందులో నివాసం ఉంటున్నారు. ఇందులో ధనవంతుడు అయితే విలాసవంతమైన విల్లాలు కట్టుకొని ఉంటారు. లేనివారు ఉన్నంతలో కొట్టుకొని ఉంటారు.
కానీ పూర్వకాలంలో ఇప్పటిలాగా సెపరేట్ గా ఇండ్లలో బాత్రూం, రెస్టు రూము అనేవి ఉండేవి కావు. ఆ రోజుల్లో మగవారైనా సరే, ఆడవారైనా సరే స్నానం చేయాలంటే దగ్గర్లోని బావి లేదా చెరువులు, నదుల దగ్గరికి వెళ్లి స్నానాలు చేసేవారు. పూర్వకాలంలో ఆడవాళ్ళయితే ఏదైనా వస్త్రాన్ని మెడ భాగం నుంచి కాళ్ల భాగం వరకు చుట్టబెట్టుకుని స్నానం చేసేవారు. మగవారు కూడా గోచి లాంటివి ధరించి స్నానాలు చేసేవారు. ఆ విధంగా స్నానం చేసి వారు ఆ తడిబట్టలతో ఇంటికి వెళ్ళేవారు. ముఖ్యంగా నదులలో కానీ చెరువులో కాని స్నానం చేసేటప్పుడు దిగంబరంగా స్నానం చేయకూడదు. అది చిన్న పిల్లలు అయినా సరే ఒక వస్త్రాన్ని మాత్రం ఒంటి మీద ఉంచాలి.
ఈ నియమం అనేది పూర్వకాలం నుంచి ఉంది. ఎందుకంటే ఆ సమయంలో బాత్రూంలో అందుబాటులో లేవు కాబట్టి బయట పదిమందిలో స్నానం చేసేవారు దానివల్ల వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేయాలనే నియమం పెట్టారు. ముఖ్యంగా నదుల వద్ద స్నానానికి ఒక ఆధ్యాత్మిక అంశం ఉంటుంది. నదుల వల్ల మనం జీవనం కొనసాగిస్తున్నాం. అందుకే వాడిని జీవనదులు అంటారు. కాబట్టి నది స్నానాన్ని మనం చాలా గౌరవించాలి. పూర్వకాలంలో ఏవైనా రోగాలు అంటుకుంటే నదీ స్నానాలు చేస్తే తగ్గేవి. అంటే అందులో అంతా అద్భుత శక్తులు ఉండేవి
అందుకే ఆ నదుల వద్దే మన పెద్దలకు తద్దినాలు పెడతాం, అలాగే కార్తీక దీపాలు పెడతాం. ఆ నది నీరే మనం తాగుతాం. కాబట్టి నదీ స్నానాన్ని పవిత్రంగా భావించేవారు. అందుకే నదుల్లో, ఊరి చెరువుల్లో దిగంబరంగా స్నానం చేయకూడదు. అక్కడికి వెళ్లే ముందు మనం బాత్ రూమ్ కి వెళ్లి, కాళ్ళు కడుక్కొని మనం శుభ్రంగా నదిలోకి వెళ్లాలి. అలాగే స్నానం కూడా నలుగురు ఉన్నచోట, ఆకాశం చూసే చోట నగ్న స్నానం చేయకూడదు. నదులు దైవ స్వరూపం కాబట్టి గౌరవించాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు.