మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే..!!

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే..!!

by Sunku Sravan

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు, పెళ్లి అనేది చాలా ప్రత్యేకం. చాలామంది ఇండ్లను ఈ విధంగా కట్టుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. కొంతమంది పెళ్లి విషయంలో కూడా ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఆశ పడుతూ వారి కోరికలను సాకారం చేసుకుంటారు. అయితే ఇండ్ల విషయానికి వస్తే మనం కొత్త ఇల్లు కట్టుకున్న లేదా పాత ఇల్లు అయినా సరే ఇంటి ఆవరణలో మొక్కలను పెంచడం కామన్. కానీ ఆ మొక్కల వల్ల కూడా మనకు ఆర్థిక లాభనష్టాలు అనేవి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Video Advertisement

మరి ఏ మొక్కలు ఉండకూడదో చూద్దాం..? ప్రతి ఒక్క వస్తువుకి ఒక శక్తి అనేది ఉంటుంది. అగ్ని, వాయు, ఆకాశ, నీరు ఇలా దేని శక్తి దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో మొక్కలు అనేవి వాయుతత్వాన్ని కలిగి ఉంటాయి.

plants

ముఖ్యంగా మొక్కలు కొన్ని ఇళ్ళలో చుట్టూ ఉంటాయి. దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది మొక్కలను పెట్టకూడని ప్రదేశంలో మాత్రమే పెట్టి, అందులో ముళ్ళ ముక్కలను ఎక్కువగా పెంచడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మనం ప్రత్యేకంగా మొక్కలు ఏ స్థలంలో పెట్టుకోవాలంటే తూర్పు భాగం సూర్యుడు ఉదయించే భాగంలో మొదలు పెట్టుకొని ఈశాన్యంలో కొంత భాగాన్ని వదిలేసి తూర్పు భాగం నుంచి ఆగ్నేయ భాగం వైపు ఇక్కడి నుంచి దక్షిణం వైపు మొక్కలను పెంచుకోవచ్చు. కేవలం ఒక వైపు మొక్కలు పెంచుకోవాలంటే మాత్రమే ఇవి పాటించాలి. దీనివల్ల మీకు ఆర్థికంగా కాని రాజకీయంగా కాని ఇతర విషయాల్లో మంచి జరుగుతుంది. అలాగే తులసి మొక్కను కూడా చాలామంది తూర్పు లేదా ఉత్తరం వైపు పెడుతూ ఉంటారు కానీ నిజానికి ఇది దక్షిణం వైపు పెంచితే చాలా బాగుంటుంది.

plants 1

ఎందుకంటే దక్షిణానికి అధిపతి యముడు, కాబట్టి యమధర్మరాజు ఎనర్జీ పాజిటివ్ కావాలంటే తులసి మొక్కను అక్కడ పెంచాలి. అయితే తూర్పు వైపు పెట్టుకోవడం ఉత్తరం వైపు పెట్టుకోవడం వల్ల తప్పుకాదు. కాని యముడి సమస్య నుంచి తప్పించుకోవాలంటే దక్షిణం వైపు పెడితే మంచిది. ముఖ్యంగా మొక్కల్లో ముళ్లు కలిగిన మొక్కలను ఎక్కువగా ఇంట్లో పెంచకూడదు. తూర్పు ఈశాన్యం నుంచి ఆగ్నేయ దక్షిణం వరకు పెంచుకోవచ్చు. పొరపాటున కూడా ఎక్కువ మొక్కలని నార్త్ సైడ్ లో పెంచకూడదు. ఇలా మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు రావని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.


End of Article

You may also like