ఇంట్లో ఉండే పాత శుభలేఖలని ఏమి చేయాలి..? అలా మాత్రం పడేయకండి.. మరేం చేయాలంటే..?

ఇంట్లో ఉండే పాత శుభలేఖలని ఏమి చేయాలి..? అలా మాత్రం పడేయకండి.. మరేం చేయాలంటే..?

by Sunku Sravan

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం. పెళ్లి అనేది రకరకాలుగా ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది వారి అమ్మానాన్నలు చూసినటువంటి అమ్మాయిని వారి వారి కుల, మత నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమించుకొని వారి ఇష్టాయిష్టాలు కలిస్తే వివాహాలు చేసుకుంటారు. కొంతమంది వివాహాలు చేసుకుంటే పదిమందికి గుర్తుండిపోయేలా చేసుకుంటారు. దీనికోసం ఖర్చుకు వెనకడుగు వేయరు. పెళ్లి కార్డు నుంచి మొదలుకొని పెళ్లి తంతు పూర్తి అయ్యే వరకు ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు.

Video Advertisement

అయితే ఈ పెళ్లిలో ముఖ్యంగా పెళ్లి కార్డు ( శుభలేఖ )లతో మన బంధువులకు, స్నేహితులకు ఆహ్వానం పలుకుతాం. మరి పెళ్లి ఘట్టం అంతా ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో కార్డులు అనేవి మిగిలి ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలో, ఎక్కడ పడేయాలో చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే పెళ్లి కార్డు ను చాలామంది దైవంగా భావిస్తారు. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందాం..? పెళ్లి అయిన సంవత్సరం దాకా వాటిని ఇంట్లోనే ఉండనివ్వండి.

ఆ తర్వాత శుభలేఖలు ముక్కలు చేసేయండి. తర్వాత దాన్ని డస్ట్ బిన్ లో వేయాలి. ఎందుకంటే వాటిపై మన అడ్రస్ లు కూడా ఉంటాయి కాబట్టి. పూర్వకాలంలో శుభలేఖపై ఎక్కువగా సీతారాముల బొమ్మలు ముద్రించేవారు. ఆ కార్డులను జాగ్రత్తగా ఇంట్లో ఉండే ఒక కోక్కానికి తగిలించేవారు. చివరికి నీళ్లలో కలిపి వేసేవారు. కానీ ప్రస్తుతం కార్డులు మామూలుగానే ఉంటున్నాయి. కనుక బకెట్ నీళ్లలో వాటిని వేసి తర్వాత ముక్కలు చేసి చెత్త బుట్టలో పడేయాలి. పూర్వకాలంలో అయితే పారే వాగుల్లో, చెరువుల్లో,నదుల్లో పడేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి బకెట్ నీటిలో వేసి బిన్ లో వేసేస్తున్నారు.


End of Article

You may also like