IND vs ENG Test Series: ఇంగ్లాండ్ టూర్ కి పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ ! టీం ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ లో అయిదు టెస్టులు ఆడవలసి ఉంటుంది. ఆగష్టు మొదటి వారం నుంచి మొదలు కానున్న ఈ సిరీస్ కి ఇప్పటికే జట్టుని ప్రకటించిన బీసీసీఐ. వార్మప్ మ్యాచుల్లో భాగంగా ఇటీవలే మూడురోజుల టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్టుకి ఆదిలో కష్టాలు ఎదురయ్యాయి.
Also Read: సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!
Also Read: MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !
టెస్టులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న బ్యాట్సమెన్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ అవేశ్ ఖాన్ లో గాయడినట్లు తెలుస్తుంది. కోలుకోవడానికి చాల సమయం పడుతున్న నేపథ్యంలో సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీరి స్థానం లో ఇంగ్లండ్ టూర్ కి సూర్యకుమార్, పృథ్వీ షాలు ఇంగ్లాండ్ టూర్ కి పంపుతున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ ఇదే ఏడాదిలో టీ౨౦, వన్డేలో, అరంగ్రేటం చేసాడు. పృథ్వీ షా కి ఇప్పటికే టెస్టుల్లో ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ శ్రీలంక తో ఆడుతున్న భారత జట్టులో ఉన్నారు.