పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు ఇప్పటికే రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగా మరి కొన్ని సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. తాజాగా పవన్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో సినిమా ఉంటుంది అని పలు వార్తలు వినిపించగా.. ఈ చిత్రానికి దర్శకుడు ఎవ్వరు సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారో క్లారిటీ ఇవ్వలేదు.
కాగా ఇప్పుడు ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అంటూ మళ్ళీ పలు వార్తలు వస్తున్నాయి. మరింత క్లారిటీ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే, పవన్ పుర కంబినేషన్ లో వచ్చిన బద్రి, కెమరామెన్ గంగతో రాంబాబు సినిమాలు హిట్ అయినా సంగతి తెలిసిందే.ఇప్పటికే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పూరి పవన్ కి వినిపించగా కథ నచ్చడంతో ఒకే చెప్పినట్టుగా తెలుస్తుంది. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన పవన్ మళ్ళీ సినిమాలు మొదలు పెట్టడంతో ఫాన్స్ ఖుషీగా ఉన్నారు.