ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా విడుదల అయ్యింది. గోపీచంద్ సినిమాలు అంటేనే సాధారణంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కథ కూడా అంతకు ముందు ఎక్కడా చూడనట్టుగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు అయినా సరే గోపీచంద్ స్టైల్ ప్రేక్షకులకి చాలా కొత్తగా అనిపిస్తుంది.
అందుకే గోపీచంద్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అది కూడా గోపీచంద్ మారుతి లాంటి డైరెక్టర్ తో సినిమా చూస్తున్నారు అనగానే ఈ సినిమాపై ఎప్పటినుంచో ప్రేక్షకులకి ఎలా ఉంటుందా అనే ఒక ఆసక్తి ఉంది. సాధారణంగా మారుతి సినిమా అంటే కామెడీ, కమర్షియల్ అంశాలు ఉంటాయి.
ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. సినిమాలో చాలా వన్ లైనర్ డైలాగ్స్ ఉన్నాయి. చాలా వరకు అవి వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించాయి. ఇదే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొన్ని సీన్స్ చాలా ఓవర్ గా ఉన్నాయి అని. కామెడీ అవసరం లేని చోట కూడా కామెడీ ఉండేలా చూసారు అని అది చూసే ప్రేక్షకులకు కూడా బాగా అనిపించలేదు అని అంటున్నారు. అందులోనూ ఒక సీన్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో విలన్ వాళ్ళ సోదరుడు, అలాగే కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళందరూ కేస్ ఫైల్ చేయడానికి లాయర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఒక కామెడీ ట్రాక్ వస్తుంది. “అంత సీరియస్ విషయాన్ని కామెడీ ఎలా చేశారు?” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతకు ముందు కూడా ప్రతి రోజు పండగే సినిమాలో సత్య రాజ్ పాత్ర ఇంకా కొద్ది రోజులే బతుకుతారు అని తెలిసి ఆయనను చూడడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయంపై కామెడీ చేశారు. ఆ సినిమాలో కూడా అ వచ్చే కొన్ని ఇలాగే సీరియస్ విషయాన్ని కామెడీ చేసినట్టుగా ఉంటాయి. అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిపై కామెడీ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :
- Pakka Commercial Review : “గోపీచంద్ – మారుతి” కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్… హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
- “జయం” సినిమాకి “గోపీచంద్” అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఆ డబ్బుతో ఏం చేసారంటే.?
- “మెగా స్టార్” నుంచి “రెబల్ స్టార్” వరకు… తమ నెక్స్ట్ సినిమాతో కచ్చితంగా “హిట్” కొట్టాల్సిన 8 హీరోస్..!
- హీరోయిన్లను రిపీట్ చేసిన 13 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ని రిపీట్ చేసారో చూడండి.!