• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports
  • Mythology
  • Health Adda
  • Viral

“మెగా స్టార్” నుంచి “రెబల్ స్టార్” వరకు… తమ నెక్స్ట్ సినిమాతో కచ్చితంగా “హిట్” కొట్టాల్సిన 8 హీరోస్..!

Published on June 30, 2022 by Usha Rani

జయాపజయాలు ఎవరికైనా సాధారణమే.. కానీ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తే.. విజయం అనివార్యం అవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతూ ఉంటే హీరోలా రెమ్యూనరేషన్ పడిపోతుంది. టాలీవుడ్ లో కొంతమంది హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుంటే మరి కొందరు హీరోలు మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.

ప్రస్తుతం కొంతమంది హీరోలు వరుస పరాజయాలతో విజయం కోసం ఎదురు చూస్తున్నారు.. ఆ హీరోలు ఎవరు.. వారి తదుపరి చిత్రాలు ఏంటో ఒక్కసారి చూద్దాం . .

1. ప్రభాస్
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ కు వరుసగా సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు షాక్ ఇవ్వగా ప్రభాస్ తదుపరి చిత్రం “ఆదిపురుష్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

2. చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి సైతం సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమా ఫలితాలతో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న “గాడ్ ఫాదర్” తో చిరు సక్సెస్ సాధించాల్సి ఉంది.

3. రామ్ చరణ్

ఆచార్య ఫలితం రామ్ చరణ్ కు కూడా షాకివ్వగా డైరెక్టర్ శంకర్ సినిమాతో చరణ్ తప్పక విజయం సాధించాల్సి ఉంది.

4. నాగార్జున

నాగార్జున మన్మథుడు 2తో ఆకట్టుకోకపోగా, బంగార్రాజుతో విజయం సాధించినా ఆ సక్సెస్ ఆయన రేంజ్ కు తగినది కాదు. తర్వాత చిత్రాలతో నాగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. నాగ్ ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు.

5. నాని

న్యాచురల్ స్టార్ నానికి సైతం గత సినిమాలు టక్ జగదీష్, అంటే.. సుందరానికీ.. భారీ షాకివ్వగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రానున్న “దసరా” సినిమాపైనే నాని ఆశలు పెట్టుకున్నారు.

6. గోపిచంద్

గోపీచంద్ కు కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. ఆరడగుల బుల్లెట్, ఆక్సిజన్ వంటి డిజాస్టర్లు తన ఖాతాలో ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో రానున్న “పక్కా కమర్షియల్” సినిమాతో గోపిచంద్ కమర్షియల్ హిట్ సాధించాల్సి ఉంది.

7. మంచు విష్ణు

మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

8. శర్వానంద్

bachelor heroes in tollywood

శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా యావరేజ్ గా నిలిచింది. శర్వానంద్ కొత్త లుక్ లో ఉన్న ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో శర్వానంద్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ తన నెక్స్ట్ సినిమా కోసం అని వార్తలు వినిపిస్తున్నాయి.

యంగ్ హీరో కార్తికేయ, కిరణ్ అబ్బవరం కూడా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే సినిమాల్లో ఈ హీరోలు సక్సెస్ సాధిస్తారో లేదో వేచి చూడాలి.



About Usha Rani

హాయ్.. నా పేరు ఉషారాణి. నాకు పుస్తకాలు చదవడంపై ఉన్న ఆసక్తే నన్ను ఈ రోజు రైటర్ ను చేసింది. ప్రస్తుతం తెలుగు అడ్డాలో కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా, స్పోర్ట్స్ అండ్ హెల్త్ గురించి రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతాను.

Recent Posts

  • ఫ్లాప్ అవుతాయి అని తెలిసినా కూడా… “దిల్ రాజు” తీసిన సినిమాలు ఏవో తెలుసా..?
  • Bigg Boss Telugu Vote Season 6 Online Voting: Bigg Boss 6 Voting
  • ఇదేంటి..? “సమంత” SSC మార్క్‌షీట్‌లో… ఇన్ని పొరపాట్లు ఉన్నాయా..?
  • భార్య చనిపోయిన 5 నెలలకే మరో పెళ్లి.? సమాధిలో శవం మిస్సింగ్.?
  • ఇండియాలో మహిళలు ఒంటరిగా ఉండడం ఎందుకు కష్టం.? అలాంటి మాటలు ఎందుకు వస్తాయి.?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions