Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్ చేసింది ఈ సినిమా.
మేకర్స్ తాజాగా విదేశాల పై కూడా దృష్టి పెడుతున్నారు. ఇక రెండో పార్ట్ ‘పుష్ప2’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ‘పుష్ప: ది రూల్’ ఇటీవలే మొదలైంది. సినిమా ప్రారంభం కాస్త ఆలస్యమైనా, రిలీజ్ విషయంలో మూవీ యూనిట్ పక్కాగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్ అండ్ సుకుమార్ టీమ్.
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.

ఈ డాన్స్ క్లిప్‌ను ఆడిటర్‌గా ఉన్న నటాలియా ఒడెగోవా అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళల డాన్స్ చేస్తుండగా, ఒక పాప వారిని అనుకరించి ఆకట్టుకుంది. బుధవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప-ది రైజ్ రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అల్లు అర్జున్ మరియు పుష్ప టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో పుష్ప ప్రీమియర్‌షోను ప్రదర్శించారు. దీనికి కథానాయకుడు అల్లు అర్జున్, నాయిక రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అంతే కాకుండా డిసెంబర్ 3న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో మరో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ మరియు అతని బృందం ఇటీవల దీనికి సంబంధించి విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.
అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్‌లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్‌ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.


