ఐపీఎల్ 2020 లో నిన్న ఆర్సీబీ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.ఫించ్ 15, కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఇక, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఓ ఫించ్ మరోసారి తక్కువ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ..దీంతో సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15