బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయ్యింది కంటెస్టెంట్స్ కూడా ఎవరి ఆటను వారు తమ ప్రదర్శన తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లని ప్రవేశపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక ఆట విషయానికి వస్తే ఆటలో తాము ఎలాగైనా గెలవాలని, ఆకట్టుకోవాలని ఎవరికి వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ఉంటారు.
అయితే ఎవరి ఆట వారిదే. అలా అడుగు పెట్టిన వారిలో ఒకరు ఆర్జే కాజల్ తనకి ఈ షో అంటే ఎంతో ఇష్టమని చెప్పుకుంటూ వచ్చింది అంతే తెగ ఎమోషనల్ కూడా అయ్యింది. బిగ్ బాస్ షో కోసం ముందుగానే సిద్దమై వచ్చిన ఆర్జే కాజల్. ఆర్జే కాజల్ విజయవాడ లోనే పుట్టి పెరిగారు. బయో కెమిస్ట్రీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కాజల్ కు రేడియో జాకీ గా అవకాశం రావడం తో వెంటనే ఆ ఆఫర్ ను అందిపుచ్చుకున్నారు.
కేవలం ఆర్జే గానే పరిమితం కాకుండా.. కాజల్ పలు ఈవెంట్స్ ను హోస్ట్ చేయడం కూడా ప్రారంభించారు. అలా మెల్ల గా పాపులర్ అవుతుండడం తో.. ఆమెకు 2009 లో “నిన్ను కలిసాక” సినిమా లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. ఆమె దీనిని కూడా వదులుకోలేదు. క్రమం గా చాలా మందికి ఆమె డబ్బింగ్ చెప్పారు.
ఓ వైపు ఈవెంట్స్, డబ్బింగ్ లు చెబుతూనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ గా కూడా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. సొంతం గా వ్లాగ్ ను స్టార్ట్ చేసారు. ఆ తరువాత ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ ను కూడా చేస్తూ చాలా మందికి దగ్గరయ్యారు. ఆమె పాపులారిటీ నే ఆమెకు బిగ్ బాస్ అవకాశాన్ని కూడా దక్కేలా చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కాజల్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.