రానా, సాయి పల్లవి జంట గా నటిస్తున్న సినిమా “విరాటపర్వం”. ఇది కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఉడుగుల వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా నక్సలిజం కాన్సెప్ట్ తో రూపొందుతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది.
సాధారణం గా నక్సలిజం గురించి జనాలకు అవగాహన ఉన్నది చాలా తక్కువే. ఈ మాత్రం అవగాహనా కూడా సినిమాలను చూడడం వల్లనే వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే.. నక్సలైట్లు జనాల క్షేమం కోరినా.. సామాన్య ప్రజానీకానికి దూరం గా ఉంటారు.
సినిమాల ద్వారా.. వీళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుస్తూ ఉంటుంది. అలా.. నక్సలిజాన్ని మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకుని మన టాలీవుడ్ లో కూడా సినిమాలు వచ్చాయి.. “విరాటపర్వం” సినిమాలో కూడా నక్సలిజం మెయిన్ కాన్సెప్ట్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు. సాయి పల్లవి మొదట్లో ఓ సాధారణ ఆడపిల్లలా కనిపించినా.. తరువాత రానాను అభిమానించి ఆమెకు నక్సలైట్ గా మారినట్లు చూపించారు.
అయితే.. ట్రైలర్ లో ఓ సన్నివేశం వద్ద సాయి పల్లవి కూడా రానా విసిరిన గన్ ని పట్టుకుని షూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదే సన్నివేశం మనం సాహో సినిమాలో కూడా గమనించవచ్చు. సాహోలో శ్రద్ధ ప్రభాస్ ను పట్టుకుని షూట్ చేస్తూ ఉంటుంది. అదే సీన్ విరాటపర్వంలో కూడా మనం చూడొచ్చు. కాకపోతే సాయి పల్లవి ఆపోజిట్ సైడ్ లో రానా ను పట్టుకుని షూట్ చేస్తూ ఉంటుంది. కేవలం ట్రయిలర్ ను చూసి సినిమాను జడ్జి చేయలేము. కాకపోతే.. ఈ సీన్ చూడగానే సాహోలోని ఆ సీన్ గుర్తొస్తోంది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.



సాయి పల్లవి మొదట డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి, కొన్ని రియాలిటీ షోలలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా పేరు అందించలేకపోయింది. మొదట సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో సాయి పల్లవి కి మంచి గుర్తింపు లభించింది.
అప్పటినుంచి సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి చూసుకోకుండా మిగతా భాషల్లో కూడా చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయి పల్లవి క్రియేషన్ ఎక్కువగా ఉన్నది.
ఇందులో ఆమె 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో సాయి పల్లవి తన పారితోషికాన్ని అమాంతం గా కోటి రూపాయలు చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాలు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫిదా మూవీ తర్వాత పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే నానితో శ్యాం సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ తో మూవీ రిజెక్ట్ :
ఈ విధంగా ఆమె అనేక పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే సాయి పల్లవి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించే అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లి సంపాదించుకోవాలి అనుకోలేదు. ఆమెకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం అని డ్యూటీకి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదని, మన చిరునవ్వు కంటే బ్యూటీ నెస్ ఏదీ ఉండదని చెప్పుకొస్తుంది సాయి పల్లవి.
ఇలా ఆమె చాలా సినిమాలు వదులుకోవడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ను కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ ఆమె చేసి ఉంటే 15 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీ తో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.





