ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి పొందింది. 150 కోట్ల భారతీయులతో పాటు ఇండియన్ క్రికెట్ టీం, మేనేజ్మెంట్ అందరూ కూడా నిరాశ చెందారు. చాలామంది ప్లేయర్లు కన్నీటి పర్యంతవయ్యారు.
అయితే మ్యాచ్ అయిపోయాక ప్లేయర్ ల డ్రస్సింగ్ రూమ్ వద్దకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఇండియన్ ప్లేయర్లతో మాట్లాడి బాధలో ఉన్న వారిని ఓదార్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో మాట్లాడి మరేం పర్లేదు అంటూ దైర్యం చెప్పారు.
కన్నీరు పెట్టుకున్న షమీని అయితే హత్తుకుని భరోసా ఇచ్చారు. భారత్ మొత్తం మీ వెంట ఉంది అని తెలియజెప్పారు. మోడీ చేసిన పనికి పక్క దేశాల వారు కూడా పొగడ్తలు కుడిపిస్తున్నారు.అయితే ఇప్పుడు మోడీ డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చినప్పుడు బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ బిహేవియర్ పై అందరూ కామెంట్లు చేస్తున్నారు.మోడీ మిగతా ఆటగాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు శ్రేయస్ అయ్యార్ మొఖాన్ని ముభావంగా పెట్టుకున్నాడు. మోడీ వైపు చూడకుండా నెగటివ్ ఫేస్ పెట్టాడు. ఇప్పుడు చాలామంది ఇది చూసి శ్రేయస్ అయ్యర్ పై కామెంట్ లు చేస్తున్నారు.
Just look at that expression on face of Shreyas Iyer. Absolutely trolled on face of Modi.🔥
He literally hated the presence of Panauti in the dressing room & agitated through this behavior. Deserves to be the next captain of India. pic.twitter.com/ejfv6NV9ZA
— Amock (@Politics_2022_) November 21, 2023
అయితే అది శ్రేయస్ అయ్యర్ కావాలని చేయలేదని వరల్డ్ కప్ ఓడిపోయిన బాధలో అలా ఉన్నాడని, అంతే తప్ప మోడీ అంటే శ్రేయాస్ కు ఎప్పుడు అభిమానమే అంటూ పలువురు చెబుతున్నారు. గతంలో మోడీ పుట్టిన రోజు కూడా శ్రేయస్ అయ్యార్ శుభాకాంక్షలు చెప్పాడు అంటూ గుర్తు చేస్తున్నారు. ఇది మోడీ మీద అయిష్టంతో చేసిన పని కాదని వరల్డ్ కప్ ఓడిపోయిన బాధ తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. కొందరైతే భవిష్యత్తులో కెప్టెన్ కావాల్సిన వాడివి ఇలా చేస్తే ఈ కెరియర్ ఏమవుద్ది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మోడీ అంటే క్రికెటర్లు అందరికీ అభిమానం. శ్రేయస్సు అయ్యర్ కావాలని చేసిన పని కాదు. ఆ సమయానికి తన ఎక్స్ప్రెస్ అలా ఉంది అంతే….!
Also Read:రోహిత్ శర్మ తర్వాత… ఈ 4 ప్లేయర్స్ లో నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరు…?