రోహిత్ శర్మ తర్వాత… ఈ 4 ప్లేయర్స్ లో నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరు…?

రోహిత్ శర్మ తర్వాత… ఈ 4 ప్లేయర్స్ లో నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరు…?

by Mounika Singaluri

Ads

ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా ఫైనల్లో ఓటమితో నిరాశ చెందింది.
ఆస్ట్రేలియాపై ఫైనల్‌లో ఓడి ఛాంపియన్‌ టైటిల్‌ను కోల్పోయింది. ఇప్పుడు టీమ్ ఇండియాలో నెక్స్ట్ ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే, రాబోయే టోర్నీలో భారత్ ఏం చేస్తుంది? ఐసీసీ టైటిల్ కోసం తన నిరీక్షణను ముగించేందుకు ఏమి చేస్తుంది? 2027 ప్రపంచకప్‌కు సన్నాహకాలు ఎలా చేస్తారు? రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇది మొదలవుతుందా? అయితే, హిట్ మ్యాన్ తర్వాత కెప్టెన్ అయ్యేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

Video Advertisement

అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు దొరికిన సమయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కొత్త ప్లేయర్స్ ను టీం లోకి తీసుకురావడానికి మంచి అవకాశం లభించింది.

ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ కెప్టెన్సీని వదిలేస్తేతదుపరి కెప్టెన్ అయ్యేది ఎవరు అని…?దీనికి సంబంధించి బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద పూర్తి ప్రణాళిక ఉందా అనేది కూడా ప్రశ్నగా మారింది. అవును అయితే, వాళ్లు ఏ ఆటగాళ్లపై తమ దృష్టిని ఉంచుతారు, కెప్టెన్సీకి పోటీదారులుగా ఎవరు ఉంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.తాజా ముఖాల్లో కెప్టెన్ సామర్థ్యం కూడా ఉన్న శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు కనిపిస్తాయి. ఈ ఇద్దరిలో కూడా అయ్యర్‌కే ముందుగా ఈ అవకాశం దక్కవచ్చు.

ఎందుకంటే అతనికి దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. ఈ ఏడాది 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన గిల్ కెప్టెన్సీకి ఇంకా చాలా సమయం ఉంది.వారితో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి వారు కూడా కెప్టన్ రేస్ లో ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఫిట్‌నెస్, కొన్నిసార్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఈ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తుందా లేదా వారిని పట్టించుకోకుండా గిల్, అయ్యర్‌లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదా అనేది చూడాలి. లాంగ్ రన్ లో చూస్తే రెండో ఆప్షన్ కరెక్ట్‌గా అనిపించినా టీమ్ మేనేజ్ మెంట్ ఏ నిర్ణయంతో ముందుకు వెళ్తుందో చూడాలి.

 

Also Read:కెప్టెన్ కావాల్సిన వాడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..? సీనియర్స్ స్థానాన్ని ఇతను భర్తీ చేసేవాడు కదా..?


End of Article

You may also like