కెప్టెన్ కావాల్సిన వాడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..? సీనియర్స్ స్థానాన్ని ఇతను భర్తీ చేసేవాడు కదా..?

కెప్టెన్ కావాల్సిన వాడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..? సీనియర్స్ స్థానాన్ని ఇతను భర్తీ చేసేవాడు కదా..?

by Mounika Singaluri

Ads

2023 ప్రపంచ కప్ ముగిసిపోయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న టి20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇండియా కి రానుంది. తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కి కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. సీనియర్ ప్లేయర్ లు అందరికీ విశ్రాంతి ఇవ్వడంతో జూనియర్ క్రికెటర్లకు ఈ సిరీస్ లో అవకాశం దొరికింది.

Video Advertisement

అయితే ఈ సెలక్షన్ పైన సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్లేయర్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రతిసారి అతనికి మొండి చేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే సంజు శాంసన్. అతనిని ఎంపిక చేయకపోవడం పైన అభిమానులు బీసీసీఐ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజు పైన ఎందుకంత కక్ష అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా చేరారు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడం పైన బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు సమాధానం చెప్పాలని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.సీనియర్ ప్లేయర్స్ లేనప్పుడు సంజుని కెప్టెన్ గా చేయాల్సింది.కేరళ స్టేట్ జట్టుతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. సూర్య కుమార్ యాదవ్ కంటే ఎక్కువ కెప్టెన్సీ అనుభవం సంజుకి ఉంది.

అలాంటి ఆటగాడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు, చాహాల్ ని కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ ట్విట్ చేశారు.వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్, జితేష్ శర్మను ఈ సిరీస్ కి ఎంపిక చేశారు. దాంతో సంజుకి చోటు దక్కకుండా పోయింది. ఈ నిర్ణయం పైన సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. టీంలో అవకాశం వచ్చిన ప్రతిసారి సంజూ రాణిస్తున్నాడని 80% సక్సెస్ అయ్యాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో ఏం జరిగిందో, ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ లో కూడా అదే చేసి సెలక్టర్లు సంజుకి అన్యాయం చేశారని మండిపడుతున్నారు.

 

Also Read:పేరుకి ఏమో నంబర్ 1 బ్యాట్స్‌మెన్… కానీ నీకంటే గల్లీ క్రికెటర్లు బాగా ఆడతారు ఏమో..!


End of Article

You may also like