2023 వండే ప్రపంచ కప్ టోర్నీ భారత్ కి నిరాశ మిగిల్చింది.  మంచి పర్ఫామెన్స్ తో ఫైనల్ కి అడుగుపెట్టిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇండియా ఏమైనా సరే కప్పు కొడుతుంది అని ఆశలు పెట్టుకున్న అభిమానులందరికీ నిరాశ మిగిలింది. అయితే ఫైనల్ కి ఇండియన్ టీం కూర్పు లో మార్పులు చేయాలని చాలామంది సూచించారు.

Video Advertisement

అయితే అవేమీ టీం మేనేజ్మెంట్ గాని, రోహిత్ శర్మ గాని పట్టించుకోకుండా ముందు నుంచి ఆడిన టీం తోనే ఫైనల్ కీ బరిలోకి దిగాడు. కనీసం టీంలో మార్పులు చేసి ఉంటే ఫలితము మార్పు వచ్చేదేమో అని అంటున్నారు.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినప్పటినుండి అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను ఆడిస్తున్నారు. అప్పటివరకు హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ లు టీం లో ఉన్నారు. శార్దూల్ స్థానంలో షమీ వచ్చి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే హార్దిక్ స్థానంలో వచ్చిన సూర్య మాత్రం బాగా నిరాశపరిచాడు. టి20 నెంబర్ వన్ బ్యాట్స్ మెన్  గా పేరు ఉంది. ఇండియన్ మిస్టర్ 360 అని సూర్యని పిలుచుకుంటారు. కానీ సూర్య దానికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. వరల్డ్ కప్ ఫైనల్లో 28 బంతులు ఆడి కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యాడు.

ముందు నుంచి కూడా ఇండియాకి ఆరో బౌలర్ ఆప్షన్ ఉంటే మంచిదని అశ్విన్ లేదా శార్థుల్ ఠాకూర్ ను ఫైనల్ మ్యాచ్ కి తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచించారు. అయితే టీంలో ఎటువంటి మార్పులు చేయకుండానే ఫైనల్ కి వెళ్ళిపోయారు. ఒకవేళ ఏదైనా మార్పులు చేసి ఉంటే ఫలితం భారత్ కి అనుగుణంగా వచ్చేదేమో అంటున్నారు. ఫైనల్ మ్యాచ్ కాకుండా మొత్తం లీగ్ లో కూడా సూర్య పెర్ఫార్మన్స్ అంతగా బాగోలేదు. హిట్టింగ్ ఆడతాడు అనే పేరు ఉన్న కూడా కీలక సమయంలో దానికి తగ్గట్టు ఆడలేకపోయాడు. ఏదేమైనా 2011 తర్వాత మరోసారి వరల్డ్ కప్ కొడుతుందనుకున్న ఇండియా చివరికి ఓటమి చెందింది. ఒకవేళ నెగ్గి ఉంటే ఈ విమర్శలు ఏవి వచ్చేవి కాదు.

 

Also Read:ఇప్పటి టాప్ ప్లేయర్… 3 సార్లు ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు..? IPL కి ముందు ఇతనికి ఏం జరిగింది..?