భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. దాదాపుగా నాలుగు నెలలు పాటు వర్షాలు కురిపించనున్న నైరుతి అండమాన్, నికోబర్ దీవుల్లోకి ఇవి ప్రవేశించినట్లుగా IMD భారత వాతారవరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 31 ఇవి కేరళకి తాకే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.
ఇప్పటికే ఇవి దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సుమద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.జూన్ మొదటి వారం లో తెలుగు రాష్ట్రాల్లో ఇవి ప్రవేశించవచ్చు.ఉక్కపోత తో ఆలాడిపోతున్న ప్రజలకి ఇది గుడ్ న్యూస్. మరో వైపు బంగాళా ఖాతంలో మరో వాయుగుండం ‘యాస్’ ఈ నెల 31 నుంచి అది ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్,ఒడిశా ల మధ్య తీరం దాటే ఆవకాశం ఉంది.