‘దేత్తడి’ హారిక ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా సంచలనం గా పేరు తెచ్చుకున్న హారిక. తామాడ వీడియో ఛానెల్ ఆమెకు లక్షల్లో అభిమానులని సంపాదించి పెట్టింది.ఆ పేరు పాపులారిటీ తనని బిగ్ బాస్ వరకు తీసుకెళ్లింది.తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకునే హారిక.గతం లో అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్నా కూడా తన ద్రుష్టి సోషల్ మీడియా వైపే మళ్లింది.
అతి కొద్దీ కాలంలోనే ఎంతో పేరు ని తెచ్చి పెట్టింది తామాడ వీడియో ఛానెల్ లోని వీడియోస్.హారిక తాజాగా ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ విడుదల అవ్వగా అవి విడుదల అయిన ప్రతి సారి ట్రేండింగ్ లో ఉన్నాయి.ఇకపోతే ఇటీవలే ‘దేత్తడి’ హారిక నా గర్ల్ ఫ్రెండ్ అంటూ వీడియో పోస్ట్ పెట్టి మరీ టాగ్ చేసాడు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ.అందరూ ఆమె కోపడుతుంది అని అనుకోగా ఆమె మాత్రం కూల్ గా రిప్లై ఇచ్చింది భలే ఫన్నీ గా ఉందంటూ కామెంట్ పెట్టింది.
https://www.instagram.com/p/CPIx9aKlts5/?utm_source=ig_web_copy_link
ఇవి కూడా చదవండి : ఎంత చేంజ్.. ఈ అల్లు వారి అబ్బాయి ఎలా మారిపోయాడో చూడండి..!