తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇటీవలే ప్రవేశ పెట్టిన ‘దళిత బంధు’ పథకం గురించి అందరికి తెలిసిందే. హుజురాబాద్ సభ లో ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులని ఆదుకోవాలనే ఉద్దేశం తో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా ఆయన ప్రకటించారు కూడా.
అయితే ప్రతిపక్షాలు ఈ విషయం లో చేస్తునం విమర్శలను తిప్పికొట్టాలని సీఎం కెసిఆర్ తెరాస మంత్రులకి, ఎమ్మెల్యేలకు సూచించారు. తెలంగాణ లోని అన్ని వర్గాలకి ప్రభత్వం న్యాయం చేస్తుందని ముఖ్యంగా దళితులు వెనుకబడ్డారని కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చాము.. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ అన్నారు.