డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఇప్పటివరకు అపజయం ఎరగని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కామెడీ సినిమాలకి మాస్ కమర్షియల్ సినిమాలకి అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ మాస్టర్. అనిల్ రావిపూడి ప్రతి సినిమా కూడా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే అనిల్ రావిపూడి తో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి రెడీగా ఉంటున్నారు.
హీరోలు కూడా అనిల్ రావిపూడి అడిగిన వెంటనే డేట్లు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. జంధ్యాల, ఈవీవీలు ఇన్స్పిరేషన్ అంటూ వారిని ఆదర్శంగా తీసుకుని కామెడీ సినిమాలు కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు.

ఒక్కసారి ఆయన తీసిన సినిమాల లిస్ట్ తీసుకుంటే…. నందమూరి కళ్యాణ్ రామ్ తో మొదటి సినిమా పటాస్ తీశారు. అది ఏటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ హిట్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోని సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత సాయి ధరంతేజ్ తో సుప్రీమ్ ,రవితేజ తో రాజా ది గ్రేట్, వెంకటేష్-వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్ 2, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3, తాజాగా నందమూరి బాలకృష్ణ తో తీసిన భగవంత్ కేసరి ఇది ఆయన ట్రాక్ రికార్డు.అనిల్ రావిపూడి రైటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి పలు సినిమాలకి పని చేశారు.

డైరెక్టర్ గా రైటర్ గానే తెలిసిన అనిల్ రావిపూడి యాక్టర్ గా ఎవరికీ తెలియదు. ఆయన రైటర్ గా పనిచేసిన ఒక సినిమాలో అనిల్ రావిపూడి నటించిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గోపీచంద్ హీరోగా తమిళ్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వచ్చిన శౌర్యం సినిమాకి అనిల్ రావుపూడి రైటర్ గా పనిచేశారు. ఆ సినిమాలో హాస్పటల్ లో ఒక సీన్ లో ఒక చిన్న రోల్ లో అనిల్ రావిపూడి మెరిసారు. ఇప్పుడు ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.నటనన్ డైరెక్షన్, రైటింగ్ ఏ కాకుండా అనిల్ రావిపూడి కి డాన్స్ అన్న కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన సినిమాల్లో, అలాగే స్టేజిల మీద కాలు కదుపుతూ ఉంటారు. ఏది ఏమైనా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ లో ఇన్ని టాలెంట్ లు ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
Also Read:ఆ హీరోయిన్ తో స్నేహం… అందుకే రకుల్ కెరీర్ నాశనం అయ్యిందా..? ఎవరంటే..?

ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.







