తెలుగు ఇండస్ట్రీ లోనే మిల్కీ బ్యూటీగా పేరు పొందిన ఈ అమ్మడును కొత్తగా పరిచయం చేయాల్సినక్కర్లేదు.. తన అందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె హీరోయిన్ పాత్రల్లోనే కాకుండా అనేక స్పెషల్ సాంగ్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తమన్నా చేసే స్పెషల్ సాంగ్ చూస్తే ప్రేక్షకులకు ఎంతో ఆనందం. ఈమె సినీ జీవితం పరంగా చూసుకుంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. చిరంజీవికి జంటగా బోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఎఫ్ త్రీ మూవీ లో కూడా మరోసారి వెంకటేష్ తో జత కట్టారు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో శీతాకాలం సినిమా చేస్తున్నారు. అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్, అనే హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అయితే తమన్నా పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా ఖండించింది ఈ అమ్మడు. అలాగే తమన్నా హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు.ఆమె సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అయితే తమన్నా నటించిన ఎఫ్ త్రీ చిత్రం ఈనెల 27న థియేటర్లోకి రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరంతా బిజీ అయిపోయారు. అయితే ఈ వారంలో ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం లో 200 ఎపిసోడ్ కి ఎఫ్ 3 మూవీ టీం హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో తమన్నా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ప్రోమో చివర్లో చాలా ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంటున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో అందరి కళ్ళలో కన్నీళ్లే కనిపించాయి. అయితే తమన్నా ఎందుకు ఎమోషన్ అయిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Video Advertisement