బాలయ్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…మూడో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ….

బాలయ్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…మూడో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ….

by Mounika Singaluri

నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అదే ఊపుతో ఇప్పుడు తన తదుపరి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు ఈ సినిమాకి మెగా డైరెక్టర్ బాబి డైరెక్షన్ చేయనున్నారు.

Video Advertisement

బాబీ కూడా ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టారు మీరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమా నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే బాలయ్య సినిమాలో ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఊర్వశి రౌతేల ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఇంకో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు మూడో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తుంది.

తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో సీనియర్ హీరో సినిమాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించింది. అలాగే బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్లో చేస్తుంది. బాలయ్య మిల్కీ బ్యూటీ తమన్న కలిసి ఇప్పటివరకు జత కట్టలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక నిజమైతే అభిమానులకు పండగే.


You may also like

Leave a Comment