Ads
తెలుగులో వరుస ప్రేమకథలు సినిమాలుగా వస్తున్న సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి తెలుగులో అడుగు పెట్టిన నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. భూమిక హీరోయిన్ గా నటించిన ‘రోజా పూలు’ చిత్రంతో శ్రీకాంత్ లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Video Advertisement
ఆయన ఆ తర్వాత యాక్షన్ చిత్రాల వైపు వెళ్లారు. అనంతరం ప్రేమ, యాక్షన్ కలిగిన చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిన చిత్రాలలో ఒకటి, రెండు చిత్రాలు ఆకట్టుకున్నాయి. కానీ ఆశించిన విజయం రాలేదని చెప్పవచ్చు. హీరో శ్రీకాంత్ కొంత కాలంగా సరైన విజయం లభించక, సతమతమవుతున్నాడు. ఎలాగైనా విజయన్ని సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శ్రీకాంత్ విదేశాలలో చదువు పూర్తి చేసి, యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల రూపాయలు వేతనం వచ్చే జాబ్ ని వదిలి, సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నటుడు మరియు డైరెక్టర్ అయిన శశి దర్శకత్వంలో వచ్చిన ‘రోజా పూలు’ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో అప్పుడప్పుడు తన కోలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నాడు. అలా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు. అయితే కొంత కాలం నుండి శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేకపోతున్నాడు. దాంతో ఆయన కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘లై’ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించినా కలిసి రాలేదు.
దాంతో శ్రీకాంత్ సినిమాలకి ఆయన సతీమణి వందన సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో వందనకి ప్రొడక్షన్ పనుల్లో మంచి అనుభవం ఉంది. అందువల్ల వందన తన భర్త శ్రీకాంత్ సినిమాలకి సహ నిర్మాతగా ఉంటునట్లుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read: “నా సినిమాకి అవార్డ్ ఇవ్వకుండా… చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు..!” అంటూ… “మోహన్ బాబు” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
https://www.instagram.com/p/Cm9JQkUhJRu/
End of Article