Ads
సమాజంలో ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి ఆమెకు వచ్చిన ఒక కొత్త ఆలోచన. సమాజంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని నిలబడాలి అనుకుందేమో కానీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు, గత 30 ఏళ్లుగా పురుషుడి గా జీవిస్తున్న మహిళ. అవునండి వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఆమె తమిళనాడులోని కటునాయకన్ పట్టికి చెందిన ముత్తు మాస్టర్. ఆమె ఎస్.పెచ్చియమ్మాళ్.
Video Advertisement
కటునాయకన్ పట్టి గ్రామానికి వెళ్లి ముత్తు మాస్టర్ గురించి అడిగిన వెంటనే ఎవరైనా చెప్పేస్తారు. గుర్తింపు పేరులోనే కాదు, లింగం లో కూడా మార్చేసుకుంది. ఆమె ఇలా చేయడానికి ఎంతో బలమైన కారణం ఉంది. స్త్రీ సమాజం నుండి ఎదుర్కొనే సమస్యల కారణంగా భర్త మరణంతో పురుషుని వేషంలోకి మారిపోయింది. 20 ఏళ్ళ వయసులో పెళ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. పోయే సమయంలో ఆవిడ గర్భవతిగా ఉంది. తర్వాత ఆవిడ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పోషణకై జుట్టు కట్ చేసుకొని, షర్ట్ లుంగీ ధరించి తన ఐడెంటిటీని మార్చుకుంది. పురుషులు చేసే ప్రతీ కఠినమైన పని కూడా చేస్తూ కూతుర్ని పోషించకుంది. ఆమె పురుషుడు కాదు స్త్రీ అనే విషయం మీ కుమార్తె కు మరియు కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. దాదాపు ముప్పై ఏళ్లుగా పురుషుడుగా జీవించిన ఈమె విషయం ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది.
వయసు మీద పడడంతో తన అసలు రహస్యాన్ని బయటపెట్టింది. కష్టమైన పనులు చేయలేక ప్రభుత్వం వారు అందించే వితంతు పెన్షన్ కై ఐడెంటిటీని బయట పెట్టింది. తనకు పెన్షన్ అందించి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వా అధికారులకు విన్నవించుకుంది. పెన్షన్ కొరకై అవసరమైన ఆధార్ కార్డులో ఆమె ఐడెంటిటీ పురుషుడు గాను మరియు భర్త మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆమె పెన్షన్ కై ఇబ్బంది ఎదుర్కొంటుంది.
ఈ సందర్భంగా ఆమె కూతురు మాట్లాడుతూ మా అమ్మ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆటుపోట్లను ఎదుర్కొంటూ నన్ను పెంచి పెద్ద చేసింది అని తెలిపింది. ఆమె సన్నిహితుల్లో ఒకరు ముత్తు పురుషుడు కాదు స్త్రీ అనే విషయం తనకు మరియు తన కుమార్తెకు, ఇద్దరు సన్నిహితులకు మాత్రమే తెలుసు అని వెల్లడించింది.
End of Article