Ads
తెలుగు నాట సినిమాలు చేసిన హీరోయిన్లు కొందరు బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతుంటారు. అయితే, అక్కడ అంతగా అవకాశాలు లేకపోతె.. తిరిగి మళ్ళీ ఇటువైపు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమం లో ఇక్కడి హీరోలను ఆకాశానికెత్తేస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ బాలయ్య బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలయ్య బాబు తో సినిమా చేయడం వలెనే ఇలా అయిపోయాను అంటోంది ఈమె.
Video Advertisement
ఇంతకీ విషయం ఏంటంటే… పదిహేనేళ్ల క్రితం, తనుశ్రీ బాలయ్య బాబు తో కలిసి ‘వీర భద్ర’ అనే సినిమా లో నటించింది తనుశ్రీ. ఈ సినిమా షూటింగ్ సమయం లో విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది. ఈ బ్యూటీ తెలుగు లో చేసిన ఒకే ఒక్క సినిమా ‘వీర భద్ర’. ఆ తరువాత బాలీవుడ్ వైపుకు వెళ్ళిపోయింది. తెలుగు మేకర్స్ కూడా ఎవరు ఆమె ను సంప్రదించలేదు. ఇన్నేళ్ల తరువాత తిరిగి తెలుగు సినిమా వైపు కు చూస్తోంది.. ఈ భామ బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి అప్పట్లో షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ తరువాత ఈమెకు అవకాశాలు రావడం తగ్గాయి.
ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఈమె చూపు మళ్లింది. ఈ క్రమం లో బాలయ్య బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలయ్య బాబు తో సినిమా చేస్తే లావు అవుతారు అంటూ ఈ మె బాంబు పేల్చింది. బాలయ్య పక్కన సినిమా చేసినప్పుడే తానూ లావు అయ్యానంటోంది. బాలయ్య బాబు తో సినిమా చేస్తున్న సమయం లో బాగా ఫుడ్ పెట్టి మంచిగా చూసుకునే వారని పొగడ్తలు కురిపిస్తోంది.
టాలీవుడ్ లో ప్రేమ అలానే ఉంటుందని తానూ తన పేరెంట్స్ కి చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తిరిగి టాలీవుడ్ లో అవకాశాలు వస్తే చేయడానికి తానూ సిద్ధం గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. కథ నచ్చితే, విలన్, వదిన లాంటి పాత్రలు చేయడానికి కూడా తానూ సిద్ధమేనని చెప్పుకొచ్చింది. వీరభద్ర సినిమా షూటింగ్ టైం లోని రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. రోజు బాలయ్య ఇంటి నుంచి భోజనం వచ్చేదని గుర్తు చేసుకుంది. అది తినడం వల్లనే, షూటింగ్ అయ్యే సరికి ఐదు కిలోల బరువు పెరిగిపోయిందట.. ఈ భామ చేస్తున్న వ్యాఖ్యలు చుస్తే.. హీరోయిన్లు ఎవరైనా.. మన బాలయ్య బాబు ఎంత కేరింగ్ గా ఉంటారో తెలుస్తుంది.
End of Article