“నేను అయితే ఆ సినిమాలో నటించేదానిని కాదు”…”యానిమల్” పై కామెంట్స్ చేసిన తాప్సి.!

“నేను అయితే ఆ సినిమాలో నటించేదానిని కాదు”…”యానిమల్” పై కామెంట్స్ చేసిన తాప్సి.!

by Mounika Singaluri

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి అదే స్థాయిలో ఆడియెన్స్ నుండి రెస్పాన్స్‌ రావడంతో భారీ వసూళ్లను సాధించింది. తాజాగా 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో సైతం పలు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకెళ్తూ, ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ తరువాత విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో కూడా విడుదలైంది ఈ సినిమా.

Video Advertisement

ఈ సినిమాపై హీరోయిన్ తాప్సి నెగటివ్ కామెంట్స్ చేసారు. ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ సినిమా యాక్టర్స్ కి ఒక పవర్ బాధ్యత ఉండాలని అన్నారు, దీన్ని అందరూ పాటించాలని కాదు.అది వారి పర్సనల్. ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ని క్రియేట్ చేసిన అనిమల్ లో హిం-స చాలా ఎక్కువగా ఉంది. నేను ఐతే ఆ సినిమాలో నటించేదానిని కాదు అని చెప్పారు తాప్సి. మహిళల పట్ల సినిమాలో చూపించిన సంఘటనలు మీద చాలామంది విమర్శలు గుప్పించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ కి ఆడియెన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసి కొందరు బాగుందని అంటే, కొందరు ఇదేం మూవీ అంటూ తల పట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ ఆడియెన్స్ ఈ మూవీ పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ నటీమణులు రాధిక, కస్తూరీ లాంటి వారు యానిమల్ మూవీ పై విమర్శలు చేస్తున్నారు. నటి రాధిక యానిమల్ పేరు మెన్షన్ చేయకుండా, చెత్త మూవీ, కోపం వచ్చిందని ఫైర్ అయ్యింది.

“నిన్న రాత్రి ఈ సినిమా చూడటం మొదలుపెట్టాను. సగం కూడా అయిపోలేదు. అప్పటికే విసుగొచ్చింది. అసలు ఈ మూవీని ఎలా చూశారు?మూడున్నర గంటలు ప్రజలు సినిమా హాళ్లలో ఎలా కూర్చున్నారు? ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సన్నివేశాలు ఏమిటి? ప్రేమలో పడటం, మాట్లాడుకునే సమయంలోనే అలా జరగడం ఏంటి? నన్ను తప్పుగా భావించవద్దు, ఇది ఒక ఫిల్మ్ మేకర్ టాప్ నాచ్‌లో తెరకెక్కించాడు. కానీ ఆ రేంజ్ ని అందుకోలేం. మూవీలో చాలా ఉంది. కానీ ఆ మూవీ ఎంటర్టైన్ చేయకుండా, విసుగును తెప్పించింది” అని నటి కస్తూరి ఫైర్ అయ్యారు.

 


You may also like

Leave a Comment