యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో మీరు చూశారు. దర్శక ధీరుడు రాజమౌళి స్క్రీన్ మీద సినిమాని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాని ఆస్కార్ వరకు తీసుకువెళ్లడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఎప్పటి నుండో ఆస్కార్ గురించి అనేది కలగానే ఉండేది.

Video Advertisement

కానీ నేడు RRR వలన ఆస్కార్ అవార్డు చేతికి వచ్చింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య సీన్స్ ని కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు నిజానికి వాళ్ల మధ్య సీన్స్ చాలా ఎమోషనల్ చేసేసాయి.

why RRR is the best film..

వీళ్ళిద్దరూ మొట్టమొదట మీట్ అయ్యే సీన్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో అద్భుతంగా తీశారు. పైగా పెద్ద స్టార్ హీరోలు ఏదో నటిస్తున్నారు అన్న భావన ఎవరికీ కలగలేదు. వాళ్ళ పాత్ర లో వాళ్ళు ఉన్నట్లే కనబడింది. కీరవాణి గారు ఈ సినిమా పాటలను స్వరపరిచారు. ప్రపంచమంతా కూడా ఈ సినిమాని ఇప్పుడు పొగుడుతున్నారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో వచ్చింది. దీంతో సెలబ్రిటీలు నెటిజన్లు కూడా ఆర్ఆర్ఆర్ టీం ని మెచ్చుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తాను చెప్పినట్లే చేశారు. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఎన్టీఆర్ ఎంతో గర్వంగా హుందాగా నడిచారు. ఇండియన్ ప్రైడ్ ని ఆస్కార్ వేడుక లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎన్నో అవార్డుని ఇప్పటికే కైవసం చేసుకుంది. రాజమౌళి తో పాటుగా ఎన్టీఆర్, చరణ్ విదేశాలకి కూడా వెళ్లారు. అమెరికా లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అమెరికన్ వ్యూవర్స్ ఎన్టీఆర్ ని చూసి ఫిదా అయిపోయారు కూడా. అలానే ”ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచేది నేను కాదని.. దేశ ప్రజలని..” ఎన్టీఆర్ చెప్పారు. దేశ ప్రజలని ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మీకు చూపిస్తా అని ఆయన చెప్పడమే కాదు చెప్పినట్టుగా అదే చేశారు ఎన్టీఆర్.