ప్రముఖ హీరో తారకరత్న గత నెల ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అనారోగ్యాల సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోయే పాత్రలు చేశారు.
Video Advertisement
తారకరత్న నటించిన మరి కొన్ని సినిమాలు కూడా ఇంకా విడుదల అవ్వాల్సి ఉన్నాయి. అయితే తారకరత్న భార్య సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఒక పోస్ట్ షేర్ చేశారు. తారకరత్న చనిపోయి నెల రోజులు అయ్యింది అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ లో అలేఖ్య ఈ విధంగా రాశారు. “నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిపోయి నెల రోజులు అయ్యింది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉన్నాయి. మనం స్నేహితులు అయ్యాము. తర్వాత ప్రేమించుకున్నాము. తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుని నిర్ణయించుకున్న క్షణం నుండి నువ్వు చాలా యుద్ధాలు చేశావు. మనం పెళ్లి చేసుకున్నాము. చాలా గొడవలు అయ్యాయి. వివక్షలు ఎదుర్కొన్నాము. అయినా కూడా మనం ఆనందంగా ఉన్నాం”.
“నిష్కమ్మ పుట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మన కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. కానీ అవన్నీ మనం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నాము. 2019 లో మనకి కవలలు పుట్టారు. నాకు బాగా గుర్తుంది. నువ్వు ఎప్పుడు పెద్ద కుటుంబం కావాలి అనుకుంటావు. నువ్వు నీ కుటుంబాన్ని ఎంతో మిస్ అయ్యావు”.
“ఇన్ని సంవత్సరాలు నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొన్నావు. చాలా కష్టపడ్డావు. నీ గుండెల్లో ఉన్న బాధని ఎవరు చూడలేకపోయారు. మనవాళ్లే మనల్ని బాధ పెడుతూ ఉంటే ఇంకా బాధగా ఉంటుంది. నీకు నేను కూడా సహాయం చేయలేకపోయాను. నువ్వు రియల్ హీరో. మేం మొత్తం కుటుంబంగా నీతో ఈ ప్రయాణం చేసినందుకు చాలా గర్వపడుతున్నాము. మళ్లీ ఎప్పటికైనా కలుస్తాము అని అనుకుంటున్నాను” అని రాశారు. అలాగే తారకరత్న కుటుంబంతో ఉన్న కొన్ని ఫోటోలని కూడా అలేఖ్య షేర్ చేశారు.