Ads
అతని పేరు గౌతమ్. రైల్వేలో టిసిగా పని చేస్తున్నాడు. వయసు 50 కి పైమాటే. అనుభవంతో పాటు లోకజ్ఞానం కూడా ఏర్పడిన వయసు అది. తన వృత్తి రీత్యా ట్రైన్ లో అటూ..ఇటూ తిరుగుతూ ఉంటే.. ఓ నలిగిపోయిన పర్స్ కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే.. అందులో కొంత చిల్లర, ఒక కృష్ణుడి ఫోటో కనిపించాయి. కనీసం కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఏమి లేకపోవడంతో ఆ పర్స్ ఎవరిదో ఎలా తెలుస్తుంది అని అనుకున్నాడు.
Video Advertisement
అటూ ఇటూ తిరుగుతూ.. అక్కడే ఉన్న పాసెంజర్స్ ని అడిగాడు. ఈ పర్స్ ఎవరైనా పడేసుకున్నారా..? అని అడిగాడు. ఆ పక్కనే ఉన్న ఓ వృద్ధుడు వచ్చి.. ఈ పర్స్ నాదేనండి అని అన్నాడు. వెంటనే.. ఈ పర్స్ నీదేనని ఎలా చెప్తావ్..? ఏదైనా గుర్తులు చెప్పాలి కదా అని నిలదీసాడు. దానికి సమాధానం గా ఆ వృద్ధుడు అందులో ఒక కృష్ణుడి ఫోటో ఉంటుంది అంటూ గుర్తులు చెప్పాడు. అలా ఒక్క గుర్తే చెప్తే ఎలా..? ఇందులో మీ ఫోటో కూడా పెట్టుకుంటే ఈజీగా గుర్తుపట్టేవాళ్ళం కదా అని ఆ టిసి అన్నాడు.
దానికి ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి బదులిచ్చాడు. “అయ్యా.. ఆ పర్స్ ను నాకు మా తండ్రి గారు ఇచ్చారు. నాకు నా తల్లితండ్రులంటే చాలా ఇష్టం కాబట్టి మొదట్లో వారి ఫోటోను పెట్టుకునే వాడిని. ఆ తరువాత నేను యవ్వనంలోకి వచ్చాక.. నేను అందంగా ఉండేవాడిని కాబట్టి నా ఫోటో పెట్టుకున్నాను. ఆ తరువాత నాకు పెళ్లి అయింది. నా భార్య కూడా చాలా అందంగా ఉంటుంది.అందుకే తన ఫోటో ను పెట్టుకునేవాడిని.
మరికొంతకాలానికి నాకు పిల్లలు పుట్టారు. వారే నాలోకంగా గడిచిపోయేది. నా పిల్లలే నా సర్వస్వము. అందుకే.. నా పిల్లల ఫోటోను పెట్టుకునేవాడిని. ఇప్పుడు నా పిల్లాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. నా భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు నేను ఒంటరివాడిని. నాకు ఎవరైనా తోడు ఉన్నారు అంటే.. అది కృష్ణుడే. ఆయన ఫోటో నేను ఎప్పుడో పెట్టుకోవాల్సింది. ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదని ఆయన ఫోటోనే పెట్టుకున్నా…” అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వృద్ధుని స్టోరీ వినగానే టిసి ఏమి మాట్లాడలేదు. ఆ పర్స్ అతనికి ఇచ్చేసి.. తరువాత స్టేషన్ లో రైలు దిగి ఓ షాపుకు వెళ్ళాడు తనకు ఇష్టమైన దేవుడి ఫోటోను కొనుక్కుని, పర్స్ లో పెట్టుకోవడానికి.
End of Article