వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణంగానే ఆనందయ్య మందు నిలిపివేత : చంద్రబాబు

వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణంగానే ఆనందయ్య మందు నిలిపివేత : చంద్రబాబు

by Anudeep

Ads

సుమారు 70 వేల మందికి మందుని అందచేసిన ఆనందయ్య వైద్యం పై ఎక్కడ ఫిర్యాదులు అందలేదని, ఆయుర్వేద వైద్యం పై ఆయుష్ శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదని కేవలం వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణం చేతనే ఆనందయ్య మందు పంపిణి ఆగిందని నిన్న జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో లో జరిగిన సమావేశం లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Video Advertisement

Also Read :

త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్లు వీరే.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!

chandrababu-naidu-fires-on-ycp-govt

chandrababu-naidu-fires-on-ycp-govt

మందు పట్ల ఎలాంటి ఫిర్యాదులు అందకపోయిన ఆనందయ్యని అప్రకటిత గృహ నిర్బధం లో పెట్టడం ఏంటి అని ?ప్రశ్నించారు.అలాగే బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులపైన పెట్టిన కేసుల పట్ల కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.వైసీపీ గుండాలు జనార్దన్ రెడ్డి ఇంటి సమీపం లో చేసిన దాడిని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అయన అన్నారు.ప్రభుత్వాస్పత్రుల సందర్శనకు బయలుదేరిన 40 మంది టీడీపీ నాయకులని అడ్డుకోవడం ఏంటి అని వైసీపీ ప్రభత్వాన్ని ప్రశ్నించారు.ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలోనే టీడీపీ మహానాడుకి నిర్వహించనున్నట్లుగా పార్టీ తీర్మానించింది.

ఇవి కూడా చదవండి : చదువుతో తన తలరాతను తానే మార్చుకొని తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన ఓ అమ్మాయి కథ ఇది


End of Article

You may also like