స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ పైన జైలు నుండి బయటకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయట్లేదని తేల్చేశారు. దీంతో తెలంగాణలో టిడిపి ఓట్లు ఎవరికి పడతాయని రాజకీయ చర్చ జరుగుతుంది.

Video Advertisement

టిడిపి ఎన్నికల్లో పోటీ చేయకపోతే అది ఏ పార్టీకి మేలు జరుగుతుందని చర్చ కూడా జరుగుతుంది. అయితే తెలంగాణలో 23 లక్షల మంది సెటిలర్లు ఉన్నారు. వాళ్లంతా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అధికారంలోకి రావడం, సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2014 తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది 74 స్థానాల్లో పోటీ చేసి 14చోట్ల గెలిచింది. 2014లో టిడిపికి 14.7% ఓట్లు దక్కాయి 2018 నాటికి తెలంగాణలో టిడిపి బలహీన పడిపోయింది. పోటీ చేసిన 14చోట్లలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది.అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నెలరోజులపాటు బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉండిపోయారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందంటూ ఆనందపడ్డారు. హైదరాబాదులో ఉన్న సెటిలర్లు చంద్రబాబు కోసం ధర్నా చేస్తుంటే దానిపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు బిఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఉంది.

ktr-slams-etela

చంద్రబాబు కోసం ఇక్కడ ధర్నా చేయడానికి వీలు లేదని, అది ఏ పీకి సంబంధించిన సమస్య అంటూ నోరు జారారు. ఈ మాటల వల్ల బిఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పంచుకుంది. బిఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటుంది. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకపోతే ఆ ఓట్లన్నీ గంపు గుత్తుగా కాంగ్రెస్ కు పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ కి మేలు చేయడానికి చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకపోవడం నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

 

Also Read:విద్యార్థుల కష్టాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు..! ఈ సినిమా చూశారా..?