రూ.10 వేలతో మొదలుపెడితే రూ.10 కోట్లకు చేరిన వ్యాపారం..! ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఈ కుర్రాడి స్టోరీ తెలుసా?

రూ.10 వేలతో మొదలుపెడితే రూ.10 కోట్లకు చేరిన వ్యాపారం..! ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఈ కుర్రాడి స్టోరీ తెలుసా?

by Anudeep

Ads

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ఐడియా చిన్నదే కావచ్చు. కానీ దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అన్నదే ముఖ్యం. ఆ ఐడియా ను మీరు ఎంత సమర్ధవంతంగా అమలు చేయగలిగారు అన్నదే ముఖ్యం.

Video Advertisement

ఎంత డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం అన్నది కాదు.. ఎంత లాభాన్ని తీసుకురాగలిగాం అన్నదే ముఖ్యం అంటూ ఈ కడియం కుర్రాడు చెప్పకనే చెబుతున్నాడు. మనం చేసే పని చిన్నదే కావచ్చు. కానీ, దానికి బ్రాండింగ్ తీసుకొస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.

tea time 1

ఆ కుర్రాడి స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కడియం అనే ఊరు రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాపారం చేయడం కోసం కడియంకు చెందిన తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ అనే కుర్రాడు తన ఉద్యోగాన్ని వదిలేసాడు. అదేదో చిన్న చితకా ఉద్యోగం కూడా కాదు. ముప్పయ్యేళ్ల వయసులోనే విదేశాల్లో లక్షల వేతనం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శ్రీనివాస్. కానీ, ఈ వ్యాపారం కోసం ఆ ఉద్యోగాన్ని వద్దు అనుకున్నాడు.

tea time 2

తన వ్యాపార లక్ష్యం వెనుక యువతకి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం కూడా ఉంది. 2017 లోనే ‘టీ టైమ్‌’ పేరిట టీ కొట్టు బడ్డీని ఏర్పరిచాడు. దానికి అధునాతన హంగులను జత కలిపి సరికొత్త బ్రాండ్ ను సృష్టించాడు. తక్కువ టైంలోనే ఈ ‘టీ టైమ్’ కు ఆదరణ లభించడంతో దేశవ్యాప్తంగా తన టీ స్టాల్స్ ను విస్తరించడం మొదలు పెట్టాడు. కేవలం 10 వేలతో మొదలైన “టీ టైం” ఇప్పుడు పది కోట్ల టర్నోవర్ తో నడుస్తోంది. కేవలం ఐదేళ్లలోనే ఈ ఘనతని “టీ టైం” సాధించింది.

tea time 3

శ్రీనివాస్ హైదరాబాద్ లోనే బిటెక్ కంప్లీట్ చేసారు. ఆయన తండ్రి వీరభోగవసంతరావు దక్షిణాది రాష్ట్రాలలో టాప్ కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు కూడా దక్షిణాది భాషలపై మంచి పట్టు లభించింది. బిటెక్ తరువాత జాబ్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ అక్కడ బ్రాండెడ్ కాఫీ షాపుల్లో కప్పు కాఫీ ఐదొందలు ఉండడం చూసారు. అందులో వాడే పదార్ధాల కంటే బ్రాండింగ్ కే ఎక్కువ ధర ఉందన్న విషయాన్నీ గుర్తించిన శ్రీనివాస్ అదే ఫార్ములాని ఇండియాలో అప్లై చేసారు.

tea time 4

అయితే.. సంపాదన కోసమే కాకుండా.. సామాన్యులకి కూడా బ్రాండెడ్ టీ ను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యం తోనే “టీ టైం” ను ప్రారంభించానని శ్రీనివాస్ చెబుతుంటారు. రాబోయే మూడేళ్ళలో మరో 10 వేల అవుట్ లెట్స్ ను ప్రారంభించే ఉద్దేశ్యంలో ఉన్నారు. అందుకు తగ్గట్లే ప్రణాళిక రచించుకుని ముందుకు వెళ్తున్నా అంటున్న ఈ యువ బిజినెస్ మ్యాన్ ను అభినందిద్దామా..


End of Article

You may also like