“తెలుగు” ఆర్య Vs “తమిళ్” ఆర్య..! ఇద్దరు హీరోల్లో ఈ “సీన్” ఎవరు బాగా చేశారు..?

“తెలుగు” ఆర్య Vs “తమిళ్” ఆర్య..! ఇద్దరు హీరోల్లో ఈ “సీన్” ఎవరు బాగా చేశారు..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ చేసిన సినిమా ఆర్య. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఇటీవల 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ సినిమా మాత్రం ఇంకా చాలా మందికి కొత్తగానే అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం అప్పట్లో చాలా కొత్త విషయం. ఇప్పటికి కూడా సుకుమార్ మొదటి సినిమాతోనే ఇలాంటి సినిమా ఎలా తీశారు అని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆయన రాసుకున్న కథని చాలా మంది అభినందిస్తూ ఉంటారు. అలాంటి కథని తెర మీదకి తీసుకురావడానికి హీరోగా నటించిన అల్లు అర్జున్ ని కూడా అభినందిస్తూ ఉంటారు. అప్పటి నుండి వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పుష్ప సినిమా కూడా చేస్తున్నారు.

Video Advertisement

telugu arya tamil arya who did it better

అయితే, ఇంత మంచి సినిమాకి రీమేక్స్ రాకుండా ఉంటాయా? వచ్చాయి. ఈ సినిమాని తమిళ్ లో ధనుష్ రీమేక్ చేశారు. ఆ సినిమా పేరు కుట్టి. 2010 లో ఈ సినిమా వచ్చింది. 2005 లో బాధ పేరుతో బెంగాలీ బంగ్లాదేశ్ లో కూడా రీమేక్ చేశారు. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన కుట్టి సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇదే దర్శకుడు ఇటీవల ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. కుట్టి సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకి తెలుగులో వచ్చినంత మంచి రివ్యూ రాలేదు. అప్పటికే తెలుగు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి తమిళ్ సినిమా తెలుగులో ఉన్నది ఉన్నట్టు తీసినా కూడా అంత మంచి స్పందన రాలేదు. కానీ యావరేజ్ నుండి అబవ్ యావరేజ్ టాక్ అయితే సంపాదించుకుంది.

కానీ ఇందులో నటీనటుల నటన బాగుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుష్ గురించి. తెలుగులో అల్లు అర్జున్ చాలా బాగా నటించారు. అందులో సందేహం లేదు. కానీ ధనుష్ కూడా ఈ సినిమాలో బాగా నటించారు. ఈ సీన్ అందుకు ఉదాహరణ. గీత వచ్చి ఆర్యకి ఐ లవ్ యు అని చెప్తుంది. ఇందులో అల్లు అర్జున్ ఒక రకంగా రియాక్ట్ అయితే, ధనుష్ ఇంకొక రకంగా రియాక్ట్ అయ్యారు. కానీ వేరు వేరుగా చూస్తే ఇద్దరి నటన బాగుంది. తమిళ్ వాళ్లకి ధనుష్ నటన నచ్చితే, తెలుగు వారికి అల్లు అర్జున్ నటన నచ్చుతుంది. ఇదే విషయం మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

watch video :


End of Article

You may also like