ఇలాంటి గొప్ప విషయంలో “మెగాస్టార్” ని మర్చిపోవడం ఏంటి..? ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..?

ఇలాంటి గొప్ప విషయంలో “మెగాస్టార్” ని మర్చిపోవడం ఏంటి..? ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..?

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. సూర్య సినిమా అంటే ఒక తెలుగు హీరో సినిమా అన్నట్టే ఉంటుంది. సూర్య అంటే మన తెలుగు హీరోల్లో ఒకరిగానే ప్రేక్షకులు అనుకుంటారు. సూర్య సినిమా విడుదల అవుతుంది అంటే ఒక తెలుగు సినిమా విడుదల అవుతుంది అనేలాగా ఉంటుంది.

surya

అందుకే సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులో తప్పకుండా విడుదల అవుతుంది. ఇదిలా ఉండగా, సూర్యకి ఇటీవల ఆస్కార్ నుండి ఆహ్వానం వచ్చింది. దాంతో చాలా మంది ఆస్కార్ కి వెళ్తున్న మొదటి సౌత్ ఇండియన్ అని అన్నారు. కానీ సూర్య కంటే ముందు మెగాస్టార్ చిరంజీవికి ఆస్కార్ కి వెళ్లే ఆహ్వానం వచ్చింది. 1987లో చిరంజీవికి ఆస్కార్ కి వెళ్లే అవకాశం వచ్చింది. కానీ ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అలా ఆస్కార్ కి వెళ్ళిన మొదటి సౌత్ ఇండియన్ గా చిరంజీవికి గుర్తింపు దక్కింది. కానీ ఈ విషయాన్ని అందరూ మర్చిపోయి మొదటి సౌత్ ఇండియన్ సూర్య అని అంటున్నారు.

కానీ చిరంజీవికి కేవలం ఆస్కార్ ఈవెంట్‌కి ఆహ్వానం అందింది. సూర్య కి ఆస్కార్ కమిటీలో మెంబర్‌షిప్ వచ్చింది. కానీ అసలు ఆస్కార్ గుర్తించిన మొదటి సౌత్ ఇండియన్ సూర్య అని కొన్ని చోట్ల రాశారు అని, దాంతో,  “చిరంజీవిని ఎలా మర్చిపోయారు? ఇంత పెద్ద విషయంలో ఇలాంటి పొరపాటు ఎలా చేశారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సినిమా అయిన గాడ్ ఫాదర్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.


End of Article

You may also like