“స్వాతంత్రం” కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టిన… ఈ 12 “అచ్చ తెలుగు” వీరులు ఎవరో తెలుసా..?

“స్వాతంత్రం” కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టిన… ఈ 12 “అచ్చ తెలుగు” వీరులు ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

ఎంతో మంది వీరులు దేశం కోసం శ్రమించారు. నేడు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం నాడు వాళ్ల పడ్డ శ్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది గొప్ప సమరయోధులు ఉన్నారు. పైగా వాళ్ల యొక్క తీరు లో వాళ్ళు ప్రసిద్ధి చెందారు. అల్లూరి సీతా రామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు ఇలా చెప్పుకు పోతే చాలామంది స్వాతంత్ర యోధులు ఉన్నారు.

Video Advertisement

మరి అటువంటి గొప్ప సమరయోధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుందాం.

#1. అల్లూరి సీతారామరాజు:

అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోదయ శక్తి. సాయుధ పోరాటం ద్వారా స్వతంత్రం వస్తుందని నమ్మారు అల్లూరి సీతారామరాజు. అందుకోసం తన ప్రాణాలని అర్పించారు. 27 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్నారు అల్లూరి సీతారామరాజు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈయన పుట్టారు. 27 ఏళ్ల వయస్సులో అమర వీరుడయ్యారు.

#2. పొట్టి శ్రీరాములు:

పొట్టి శ్రీరాములు 16 మర్చి 1901 లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ కోసం 56 రోజుల నిరాహార దీక్ష చేసి తుది శ్వాసను విడిచారు. ఆంధ్రప్రదేశ్ గురించి ఈయన చేసిన త్యాగం మూలంగా అమర జీవి అని అంటారు. స్వాతంత్ర ఉద్యమాలలో కూడా చురుకు పాల్గొన్నారు. 1930 వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం లో ఈయన పాల్గొన్నారు. 1941 నుండి 42 మధ్యలో స్వయంగా కూడా స్వతంత్ర సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. దాంతో మూడుసార్లు అరెస్టు అయ్యారు కూడా.

#3. పింగళి వెంకయ్య:

భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అని ఒక ఆంగ్ల గ్రంథాన్ని వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం లో ఈయన జన్మించారు. 19 ఏళ్ల వయసులో దేశభక్తి తో దక్షిణాఫ్రికాలో జరిగే రెండవ బోయర్ యుద్ధం లో ఈయన పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో వున్నప్పుడు మహాత్మా గాంధీని ఈయన కలిశారు. అలానే ఈయన వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించారు. దానితో ‘డైమండ్ వెంకయ్య’ అని పిలిచారు.

#4. ఆచార్య N.G.రంగ:

గోగినేని రంగనాయకులు ఆచార్య N.G.రంగ గా ప్రసిద్ధి చెందారు. జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు మరియు భారత స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. భారత రైతాంగ ఉద్యమపితగా ఈయన్ని భావించేవారు. 1991 లో ఈయనకి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. 1930-1991 లో భారత పార్లమెంట్‌ సభ్యునిగా పని చేసారు ఈయన.

#5. టంగుటూరి ప్రకాశం పంతులు:

టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. 1937లో కాంగ్రెసు అధికారం లోకి వచ్చింది. రాజాజీ మంత్రి వర్గం లో రెవిన్యూమంత్రి అయ్యారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేశారీయన. 1928లో మద్రాసు లో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తుపాకికి ఎదురు నిలబడి కాల్చమని సవాలు చేసారు. ఆ ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర కేసరి అనే బిరుదుని ఆంధ్ర ప్రజలు ఇచ్చి గౌరవించారు.

#6. సర్దార్ గౌతు లచ్చన్న:

ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన సోంపేట తాలూకాలో బారువా లో ఈయన 1909 ఆగష్టు 16 న పుట్టారు. 21వ ఏట గాంధీజీ పిలుపు తో చదువు వదిలేసి స్వాతంత్ర్యోద్యమం కోసం వెళ్లారు. సత్యాగ్రహానికి పిలుపుని గాంధీ ఇవ్వడం తో ఈయన బారువా దగ్గర సముద్రపు నీరుతో ఉప్పు ని తయారుచేసి… ఆ డబ్బుతో ఉద్యమాన్ని నడిపాడు. దానితో ఆయన్ని అరెస్ట్ చేసి టెక్కలి, నరసన్నపేట సబ్ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు.

#7. కన్నెగంటి హనుమంతు:

అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు ఈయన. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పుట్టారు. పుల్లరి కట్టేందుకు నిరాకరించి… పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వం లో బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. చివరికి వీరమరణం పొందారు.

#8. పాములపర్తి వేంకట నరసింహారావు:

1991 నుంచి 1996 దాకా ఈయన తొమ్మిదవ ప్రధానమంత్రిగా పని చేసారు. ఈ పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగు వాడు పాములపర్తి వేంకట నరసింహారావు.

#9. కాళోజి నారాయణ రావు:

ప్రజాకవి, తెలుగు రచయిత గా ఈయన ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా నిలిచారు. బతుకంతా తెలంగాణ కి ఇచ్చిన మహనీయుడు కాళోజీ.
ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసింది.

#10. రావి నారాయణ రెడ్డి:

రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు నాయకుడు. అలానే తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు కూడా ఈయన. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా వ్యవహరించారు ఈయన.

#11. బూర్గుల రామకృష్ణారావు:

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. అలానే ఈయన హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా బూర్గుల రామకృష్ణారావు పని చేసారు.

#12. మక్ధూమ్ మొహియుద్దీన్:

ఈయన 1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా లో జన్మించారు. ఈయన నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. అప్పట్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు.. అందుకు కారణమైన సంస్థల పట్ల ఆందోళన చెందారు. 1941 లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం అధ్యాపక వృత్తిని రాజీనామా చేసేసారు. 1942 క్విట్ ఇండియా సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రసంగాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి మూడు నెలలు జైలు శిక్ష విధించింది.

1951 మార్చిలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు 1967 నుండి చనిపోయేదాకా ఎమ్మెల్సీగా కొనసాగారు. ఉర్దూలో ఈయన రాసిన గజల్స్ కవితలని కొంతమంది తెలుగు రచయితలు అనువదించారు.


End of Article

You may also like