Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు. ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది?
Video Advertisement
ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
అయితే.. ఆచార్య సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి ఓ పది కారణాలను కూడా చెప్పుకుంటున్నారు. ఈ కారణాల వలనే ఆచార్య నెగటివ్ టాక్ తెచ్చుకుంటోందని భావిస్తున్నారు. అవేంటో మీరు కూడా చూసేయండి.
#1 రామ్ చరణ్: సినీ ఇండస్ట్రీ లో అందరికి ఓ సెంటిమెంట్ ఉండనే ఉంది. రాజమౌళితో సినిమా చేసి హిట్ కొట్టాక, కచ్చితంగా సదరు హీరో తరువాత సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ లెక్కన ఆచార్య కూడా హిట్ అయ్యే ఛాన్స్ లేదేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు.
#2 కాజల్: తొలుత కాజల్ ను చిరు పక్కన హీరోయిన్ అని చెప్పారు. కానీ లాస్ట్ మినిట్ లో ఆమెని తప్పించారు. ఫ్లో మిస్ అవుతుంది అన్న కారణంతోనే ఆమెను తప్పించారని టాక్ వినిపించింది. ఇది కూడా ఈ సినిమాకి మైనస్ అయ్యింది.
#3 బ్యాక్ గ్రౌండ్: ఈ సినిమా నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో రావడం కూడా ఓ మైనస్సే అయ్యింది.
#4 పూజ హెగ్డే: ఈమె నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ రావడంతో.. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమోనని ఫ్యాన్స్ అనుకుంటూ వచ్చారు.
#5 సోనూసూద్: కోవిడ్ పరిస్థితుల సమయంలో సోనూసూద్ అందించిన ఆపన్న హస్తానికి అందరు ఫిదా అయ్యారు. ఆయనను అందరు రియల్ హీరోగానే ట్రీట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో సోను సూద్ విలన్ గా నటించడం కూడా మైనస్ అవుతుందని అభిమానులు భావించారు.
#6 ఆచార్య సినిమా నిర్మాణానికి రూ.130 కోట్ల పైనే బిజినెస్ నడించింది. అయితే ఇది రికవర్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు.
#7 ఇప్పటివరకు వచ్చిన చిరు సినిమాల్లో చిరు మార్క్ కామెడీ కూడా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో మాత్రం కామెడీ కూడా లేదని టాక్. అది కూడా కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.
#8 క్లైమాక్స్: సాధారణంగా చాలా వరకు కొరటాల సినిమాల్లో వీక్ క్లైమాక్స్ ఉంటుంది. అది కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.
#9 కొన్ని రోజుల క్రితమే రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ ఇంకా థియేటర్లలో ఆడుతున్నాయి. దీనితో ఆచార్యకు సరిపడా థియేటర్స్ దొరకలేదు.
#10 ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడం, సినిమా టికెట్ రేట్లు ఓ రేంజ్ లో పెంచడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు రావడం అనేది కష్టమైన టాస్క్ లానే ఉంది.
End of Article