సంగీత ప్రపంచంలో ప్రస్తుతం తమన్ పేరు మార్మోగుతోంది. ఈయన 1983 నెల్లూరులో జన్మించారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత పేరు సంపాదించడం వెనుక చాలా కష్టం ఉందని ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారట. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా మంచి మనసు, దయా గుణం ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.

Video Advertisement

ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి చాలా పేరు సంపాదించారు. 13 ఏళ్ళ వయసులోనే నాన్నను పోగొట్టుకున్న తమన్ చదువుకు స్వస్తి చెప్పి సంగీతాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు.

 

అలా అంచెలంచలుగా కష్టపడుతూ ఎదిగాడు. ఆయన ఎదగడమే కాకుండా పది మందికి ఎప్పుడు ఆసరాగా ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ అనే ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ ప్రోగ్రాంలో రేణు కుమార్ అనే కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి ఆవేదన చెందుతూ చెప్పారు. కంటెస్టెంట్ రేణు కుమార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని, కనీసం అతని కొడుకుకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో స్కూల్ మన్పించానని ఆవేదనతో చెప్పాడు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా బాధ పడుతూ నేను కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఐదో తరగతిలో చదువు మానేశానని, ఆ సమయంలో మా నాన్న చనిపోవడంతో కుటుంబ పరిస్థితులు నాపై పడ్డాయని అందువల్ల నేను చదువుకు దూరం అయ్యానని బాధపడుతూ చెప్పాడు. అలా డబ్బు లేకుండా చదువుకు దూరం అయ్యే వారికి భరోసా ఇస్తానని అన్నాడు. అనంతరం రేణు కుమార్ కొడుకు చదువు కొరకు మూడు సంవత్సరాలు భరోసాగా ఉంటానని నువ్వు ఏం బాధపడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు తమన్. దీంతో ఆ స్టేజ్ అంత ఆనందభాష్పాలతో, విజిల్స్ తో నిండిపోయింది.