ఈ మధ్య సినిమాలన్నిటినీ భాషా భేదం లేకుండా ఆదరిస్తున్నారు. ఏ భాష సినిమా అయినా సరే ఒకవేళ వారి భాషలో హిట్ అయితే వేరే భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల కన్నడలో హాస్టల్ హుడుగారు బేకగిద్దారే రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : బాయ్స్ హాస్టల్
 • నటీనటులు : ప్రజ్వల్ బి.పి., మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స శ్యామ్, తేజస్ జయన్న, శ్రేయాస్ శర్మ.
 • నిర్మాత : ప్రజ్వల్ బి పి, వరుణ్ కుమార్ గౌడ, నితిన్ కృష్ణమూర్తి, అరవింద్ ఎస్ కశ్యప్
 • దర్శకత్వం : నితిన్ కృష్ణమూర్తి
 • సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్
 • విడుదల తేదీ : ఆగస్ట్ 26, 2023

boys hostel movie review

స్టోరీ :

సినిమా మొత్తం తుంగ అనే ఒక బాయ్స్ హాస్టల్ లో జరుగుతుంది. ఆ బాయ్స్ హాస్టల్ లో ఉండే అజిత్ (ప్రజ్వల్) ఒక ఫిలిం మేకర్ అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన దగ్గర సినిమాకి తగిన కథలు లేవు అని తన స్నేహితులు అజిత్ ని ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే ఒక సమయంలో ఆ హాస్టల్ వార్డెన్ (మంజునాథ్ నాయక) ఒక సూసైడ్ నోట్ రాసి అందులో కొంత మంది అబ్బాయిల పేర్లు రాసి చనిపోతాడు. హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్. తను మిలిటరీ నుండి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న హాస్టల్ అబ్బాయిలకి, వార్డెన్ కి పడదు.

boys hostel movie review

ఇప్పుడు వార్డెన్ చనిపోవడంతో వాళ్లు ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టే వారు ఎవరూ లేరు అని అనుకునే లోపే, ఆ వార్డెన్ రాసిన లెటర్ లో వాళ్ల పేర్లు ఉండటం చూసి కంగారు పడతారు. దాంతో ఆ సూసైడ్ ని యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలి అని ప్రయత్నిస్తారు. అలా చేయడం కోసం తంటాలు పడుతూ ఉంటారు. అయితే అంతలోనే ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. అది ఏంటి? హాస్టల్ వార్డెన్ శవాన్ని వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు ఆ హాస్టల్ వార్డెన్ వీళ్ళ పేర్లు ఎందుకు రాసి చనిపోయాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా అంతా కూడా ఒక నైట్ లో జరుగుతుంది. ఈ నగరానికి ఏమైంది లాంటి ఫన్ అడ్వెంచర్ సినిమాలకి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. కాకపోతే ఈ సినిమాలో కామెడీ తో పాటు కాస్త సస్పెన్స్ కూడా యాడ్ చేశారు. కన్నడలో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది.

boys hostel movie review

కానీ దాన్ని తీసిన విధానం మాత్రం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. దాదాపు 500 మంది నటులు ఇందులో కనిపించారు. ఒక రాత్రిలో ఒక హాస్టల్ లో ఉండే వాళ్లు ఎదుర్కొనే సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఒక హాస్టల్ లో ఎలాంటి అల్లరి చేస్తారు అనే విషయాన్ని కూడా చూపించారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు.

boys hostel movie review

కానీ సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం వార్డెన్ పాత్ర పోషించిన మంజునాథ్ నాయక. అంతే కాకుండా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి, ఒక వెరైటీ పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్, అలాగే మరొక పాత్రలో రష్మీ గౌతమ్ కూడా కనిపిస్తారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సినిమా మొత్తం ఒకే చోట జరుగుతుంది. ఇలా ఒక ప్లేస్ లో మాత్రమే జరిగే సినిమాల్లో కెమెరా వర్క్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాకి అది చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి.

boys hostel movie review

డైలాగ్స్ చాలా బాగా రాశారు. చూస్తున్నంత సేపు ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అని అస్సలు అనిపించదు. కానీ కొన్ని సీన్స్ మాత్రం రేపిటిటివ్ గా అవుతూ ఉంటాయి. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లో చాలా సాగదీశారు. అంతే కాకుండా చాలా చోట్ల అరుస్తూ మాట్లాడుతారు. అది కొన్ని సార్లు బాగానే ఉన్నా కొన్ని సార్లు మాత్రం చిరాకు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • వార్డెన్ పాత్ర
 • సినిమాటోగ్రఫీ
 • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
 • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

 • రిపీట్ అయ్యే కొన్ని సీన్స్
 • సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అయ్యే కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3 / 5

ట్యాగ్ లైన్ :

హాస్టల్ లో చదువుకున్న వారికి ఈ సినిమా చాలా రిలేట్ అవుతుంది. హాస్టల్ లో చేసే అల్లరి, అక్కడ ఎలా ఉంటారు అనే విషయాలని డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు. ఫన్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమాలు రావడం చాలా తక్కువ. అలాంటి సినిమాల్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా బాయ్స్ హాస్టల్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?