సాయి పల్లవి దక్షణాది సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఆమె తమిళ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతగానో అభిమానిస్తారు. ఎంతగా అంటే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే పిలుస్తారు. టాలీవుడ్ లో తన తొలి సినిమా నుండి ఆమెను తెలుగు అమ్మాయిగానే చూస్తారు. తెలుగు నేర్చుకోవడమే కాదు మాండళికాలు కూడా నేర్చుకుని ఆశ్చర్యపరిచింది.

Video Advertisement

ఇక సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనవచ్చు. ఆమె క్యారెక్టర్ నచ్చితే ప్రాణం పెట్టి నటిస్తుంది. ఇక పాత్ర నచ్చలేదు అంటే మాత్రం అది ఎంత పెద్ద స్టార్ చిత్రం అయినప్పటికి నో చెప్పేస్తుంది. టాలీవుడ్ లో సాయి పల్లవి నటించిన ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరి వంటి సినిమాలు విజయం సాధించాయిsai-pallavi-3అయితే సాయి పల్లవిని ఆడియెన్స్ అంతగా ఓన్ చేసుకోడానికి కారణం ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించడమే. సాయి పల్లవి ధరించే వస్త్రాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. హీరోయిన్స్ మేకప్ వేసుకోకుండా ఉండడం అరుదుగా జరుగుతుంది. కానీ సాయి పల్లవి మేకప్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. చెప్పాలంటే ఆమె మేకప్ వేసుకోదు. ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆన్ స్క్రీన్‌ పైన ఆమె మేకప్ ఉపయోగించదు. సాయి పల్లవి తాజాగా మేకప్ ఎందుకు వేసుకోదు అనే విషయాన్ని రివీల్ చేసింది.
ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాలో అభద్రతాభావం ఉండేది. నా ముఖం పై వచ్చిన మొటిమల్ని చూస్తే చాలా బాధగా అనిపించేది. అలాగే నా గొంతు కూడా బాగుండదు అని అనుకునేదాన్ని. నా తొలి సినిమా ‘ప్రేమమ్‌’లో మేకప్‌ లేకుండానే నటించాను. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డాను. అయితే మేకప్‌ లేకున్నా అందంగా ఉన్నానని ప్రశంసలు వచ్చాయి. ఆ మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక అప్పటి నుంచి మేకప్‌ వాడకుండానే నటిస్తున్నాను. ఇక దర్శకులు ఎప్పుడు నన్ను మేకప్‌ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. Also Read: ఇటీవల విడుదల అయ్యి “సూపర్ హిట్” అయిన ఈ తమిళ సినిమా కథ ఏంటి..? ఎందుకు దీనికి అంత క్రేజ్ వచ్చింది..?