150 అడుగులు గాల్లోకి ఎగిరి తేయాకు తోటలో పడ్డ కారు.. పరుగులు తీసిన కూలీలు.. ఏం జరిగిందంటే..!

150 అడుగులు గాల్లోకి ఎగిరి తేయాకు తోటలో పడ్డ కారు.. పరుగులు తీసిన కూలీలు.. ఏం జరిగిందంటే..!

by Sunku Sravan

Ads

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకేక్కుతున్నటువంటి ఈ చిత్రానికి దర్శకుడిగా ప్రవీణ్ సత్తార్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తోంది.

Video Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలోని కూనూరు తేయాకు తోటల వద్ద జరుగుతున్నది. అయితే ఈ సినిమాలో ఒక స్టంట్ సన్నివేశాన్ని చిత్రీకరణ ఈ సమయంలో అక్కడ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తూటర్కట్టం అనే ప్రాంతంలో కారు గాల్లోకి లేచే ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా కారు 150 అడుగుల ఎత్తు పైకి లేచి అక్కడ ఉన్నటువంటి తేయాకు తోటల్లో పడింది. ఈ సమయంలో కూలీలు తోటలో తేయాకు కోస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న విషయం వారికి తెలియదు. దీంతో కారు తోటలో పడగానే అందరూ భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. నిజంగానే కారు ప్రమాదానికి గురైందని భావించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఊర్లోకి వెళ్లి స్థానికులకు సమాచారాన్ని అందించారు. చివరికి అది నాగార్జున నటిస్తున్నటువంటి గోస్ట్ మూవీస్ షూటింగ్ అని తెలియడంతో అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.


End of Article

You may also like