Ads
మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వి కె.విశ్వనాథ్, అభిరుచిగల నిర్మాత, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావుల కలయికలో వచ్చిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’. ఈ చిత్రం వచ్చి 30 ఏళ్ళు అయింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది.
Video Advertisement
మాధవగా చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే చూడటానికి ఆర్ట్ మూవీ కానీ.. ఈ మూవీలో ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే చిరుకు – ఎద్దుకు జరిగే ఫైట్. అయితే ఈ ఫైట్ కోసం ఏకంగా ఆరు వేల కుండల్ని తెప్పించారట దర్శకుడు విశ్వనాధ్.
ఈ మూవీ లో వచ్చిన ఎద్దు ఫైట్ సీన్ కోసం నాలుగు రోజులు పట్టిందట. దీనికోసం పూర్ణోదయా మూవీ క్రియేషన్ 50 వేలు ఖర్చు పెట్టి.. ఆరు వేల కుండలను తెప్పించారట. ఎప్పటికప్పుడు పగిలిన కుండల స్థానం లో కొత్త కుండలు పెట్టేవారట. ఇలా చివరికి సీన్ పూర్తయ్యేసరికి కుండలు మిగల్లేదట. అప్పటికే మద్రాసులోని కుండలన్నీ వీళ్ళే తీసుకున్నారట.
దీంతో ఇంకా కుండలు కావలసి వస్తాయేమో అని ఆర్ట్ డిపార్మెంట్ అసిస్టెంట్స్ కుండల కోసం మద్రాసు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూనే ఉన్నారట. అలా ఆరువేల కుండలతో ఈ ఫైట్ సీన్ ని పూర్తి చేశారట విశ్వనాధ్. ఈ మూవీ లో మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే ఈ మూవీ కోసం తొలిసారి జంధ్యాల మేకప్ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి మరియు చివరి చిత్రం ఇదే.
అలాగే వివిధ విభాగాల్లో ఈ చిత్రానికి 5 నంది అవార్డులు వచ్చాయి. ‘ఆపద్బాంధువుడు’ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యం.యం. కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. మొత్తం మీద చిరంజీవి కెరీర్లో ‘ఆపద్బాంధువుడు’ ఒక మరపురాని చిత్రం. అంతేకాదు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌తో చిరంజీవికి ఇది రెండో చిత్రం. మొదటిది ‘స్వయంకృషి’.
Watch video:
End of Article