Ads
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి వచ్చేశాడు, సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా కానుకగా సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దించారు. మెగా అభిమానుల అంచనాలు అందుకుంటూ ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది.
Video Advertisement
అయితే మాతృక మలయాళ ‘లూసిఫర్’ తో పోలిస్తే చాలా మార్పులు చేసారు దర్శకుడు మోహన్ రాజా. అవన్ని వర్క్ అవుట్ అయ్యాయి కానీ.. ఒక్క సల్మాన్ ఖాన్ పాత్ర విషయం లోనే ఎక్కడో తేడా కొడుతోంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ గాడ్ ఫాదర్ చిత్రం లో ఆయన్ను పెట్టడం ద్వారా కొత్తగా సినిమాకు హైప్ వచ్చింది ఏమి లేదు. పైగా సల్మాన్ కనిపించిన యాక్షన్ సీన్స్ ఏవరేజ్ గా ఉండగా.. గ్రాఫిక్స్ అయితే మరీ నాసిరకం గా అనిపించింది.
ఆ పాత్రకు సల్మాన్ ని కాకుండా వేరే ఏ తెలుగు హీరో ని పెట్టి చేసినా చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యేదని అభిమానుల అభిప్రాయం. ఈ నేపథ్యం లో దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
అయితే గాడ్ ఫాదర్ లో ఆ పాత్రకి ముందు వరుణ్ తేజ్ ని కానీ, సాయి ధరమ్ తేజ్ ని కానీ అనుకున్నారట.మెగాస్టార్ సినిమాలో వారు కూడా కనిపిస్తే ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చినట్టే అని చెప్పొచ్చు. అయితే సల్మాన్ ఖాన్ ఆలోచన మాత్రం డైరక్టర్ మోహన్ రాజాది అని తెలుస్తుంది.
రామ్ చరణ్ సల్మాన్ కి మంచి మిత్రుడు కావడంతో.. చరణ్ ఆయన్ను సంప్రదించడం.. సల్మాన్ ఓకే చెప్పడం.. వెంట వెంటనే జరిగి పోయాయంట. మోహన్ రాజా చెప్పబట్టే సల్మాన్ ని ఈ పాత్రలో తీసుకున్నారట. అయితే అది రాంగ్ డెసిషన్ అంటున్నారు ఫ్యాన్స్. సల్మాన్ లాంటి స్టార్ హీరోని తీసుకోవడం మంచి నిర్ణయమే అయినా కూడా ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. సల్మాన్ తో చిరు రిస్క్ చేశారనే అంటున్నారు మెగాస్టార్ ఫాన్స్. ఏదేమైనా సినిమా సూపర్ హిట్ అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
End of Article