చాలా రోజుల తర్వాత ఓటీటీ లోకి ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

చాలా రోజుల తర్వాత ఓటీటీ లోకి ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

by Harika

Ads

కరోనా పుణ్యమా అని ఓటిటి ప్లాట్ఫారం బాగా ఫేమస్ అయ్యింది. ఈమధ్య సినిమాలో థియేటర్లలో కన్నా ఓటీటీలలోనే ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. లేదంటే థియేటర్లో రిలీజ్ అయిన 20 నుంచి 30 రోజుల్లో లోపలే ఓటీడీలో స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. అయితే ఒక కాంట్రవర్సీ మూవీ మాత్రం విడుదల అయ్యి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా స్ట్రీమింగ్ కాలేదు. అదే ద కేరళ స్టోరీ. ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Video Advertisement

అయితే థియేటర్లో విడుదల చేసిన వెర్షన్ కాకుండా కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలగించి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టింది ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.ఈ సినిమా.

2022 మార్చి 11న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్ మోక్షం లభించింది. ఈ చిత్రం మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో బయట కొన్ని దేశాలలో నిషేధం విధించారు అంటే ఈ సినిమా ఎలాంటి కాంట్రవర్సీని క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది యువతులు మతం మారడం తర్వాత ప్రత్యేక శిక్షణ తీసుకొని ఉగ్రవాదులుగా మారడం ఇతివృత్తంలో సాగుతుంది ఈ సినిమా.

అదృశ్యమైన యువతులలో చాలామందిని కావాలనే మతమార్పించారని, 32,000 మందికి పైగా అమాయక హిందూ క్రిస్టియన్ యువతులను ఇస్లాంలోకి మార్చి ఐసిస్ క్యాంపులకు పంపి బలవంతంగా శిక్షణ ఇప్పించారనే కోణంలో సినిమా ఉండటంతో చిత్రంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.అంతా వ్యతిరేకతను మూట కట్టుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాలీవుడ్లో రికార్డులు నెలకొల్పింది ఈ సినిమా 25 కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాని రూపొందిస్తే 350 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా


End of Article

You may also like