228
Ads
విడుదలైనప్పటి నుండి ట్రెండింగ్లో ఉన్న కన్నడ చిత్రం కాంతారా. అద్భుతమైన దీని టేకింగ్ ని మెచ్చి పలు భాషలలో డబ్ చేసి విడుదల చేసారు. తెలుగు, హిందీ తదితర భాషల్లో దీన్ని విడుదల చేసారు మేకర్స్. ఎక్కడ చూసినా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది.
కాంతారా డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి ఈ చిత్ర విజయానికి ఎంత కారకుడో.. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ కూడా అంతే కారణం. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ చిత్రానికే ప్రాణం పోసాడు అజనీష్. దీంతో ప్రస్తుతం కాంతారా చిత్రం తో పాటు అజనీష్ గురించి కూడా చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఎన్ని వందల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ తో సినిమాలు తీసిన సరైన బీజీఎమ్ లేకుంటే హిట్ అవ్వలేని పరిష్టితి.ఈ మధ్య కాలంలో హిట్ అయినా ఆర్ ఆర్ ఆర్, పొన్నియన్ సెల్వన్, కెజిఎఫ్ సినిమాలు, కార్తికేయ సినిమాలు, బింబి సారా చిత్రాలు కూడా బీజీఎమ్ తోనే హిట్ అయ్యాయి.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా హిట్ అవుతున్న ఈ క్రమం లో అజనీష్ బీజీఎమ్ కి కింగ్ లా మారాడు. అతడు ఎంత పాపులర్ అయ్యాడు అంటే కేవలం కొన్ని సినిమాలకు బీజీఎమ్ మాత్రమే అందించి పాటలు వేరే సంగీత దర్శకులకు అప్పచెప్పేవాడు. 2009 నుంచి సినిమాలకు సంగీతం అందిస్తున్న అజనీష్ కాంతారా సినిమా దర్శకుడు అయినా రిషబ్ శెట్టి కి మంచి స్నేహితుడు.వీరి స్నేహం ఎంత అంటే అజనీష్ లేదంటే కాంతారా లేదు అనేంతగా.
కాంతారా సినిమాకు బీజీఎమ్ కొట్టాలంటే మట్టి వాసన, చెట్ల ఆకుల సవ్వడి వంటివి బ్యాక్ గ్రౌండ్ లో అవసరం. సినిమాలో వాడిన అనేక వస్తువుల శబ్దాలను షూటింగ్ టైం లో రికార్డింగ్స్ చేసుకున్నాడు. కానీ లోకల్ జానపదాలు, డోలు చెప్పులు ఈ సినిమాకు సరిపోవు. అందుకే కాంతారా కు స్పెషల్ వాయిద్యం ఒకటి కావాలని అనుకున్నాడు అజనీష్. ఆఫ్రికన్ వాయిద్య పరికరం డిడ్గేరీడూ ని తెప్పించాడు. దీనితో పాటు ఇతర వ్యాయిద్యాల మేళవింపు, జానపదాల రంగరింపు తో సినిమాకు బీజీఎమ్ అందించాడు అజనీష్. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం అజనీష్ చేతిలో 14 ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటిలో కార్తిక్ దండు దర్శకత్వం లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కూడా ఉంది.
End of Article