ఏ సినిమా లో అయినా ఒక హీరోకి ఎలివేషన్ పడితే ఆ సీన్ రేంజ్ మారిపోతుంది. ఒక్క సీన్ తో సినిమా మొత్తం మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోలకు సీన్ లో ఎలివేషన్ పడితే థియేటర్ లో ఈలలు, గోలలతో నిండిపోతుంది. ముఖ్యం గా స్టార్ హీరోలకు ఎలివేషన్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటారు మేకర్స్. హీరో ఒక డైలాగ్ చెప్పి.. స్లో మోషన్ లో ఆలా వెళ్తూ ఉంటే మనం ఆ సీన్స్ కి కనెక్ట్ అయిపోతాం.

Video Advertisement

మిగతా ఇండస్ట్రీస్ తో పోలిస్తే తెలుగు సినిమాల్లో ఎప్పటికి ఫేడవుట్ అవని ఫార్ములా ఏదయినా ఉంది అంటే అది హీరోయిజం నీ.. హీరోని ఎలివేట్ చేసే సీన్స్. అయితే ఈ సీన్స్ లో కొన్ని సార్లు యాక్షన్స్, మ్యూజిక్ కీ రోల్ పోషిస్తాయి. కానీ కొన్నిసార్లు హీరో ని ఎలివేట్ చేసే పాత్రలు ఉంటాయి. అలా తెలుగులో కొన్ని సూపర్ హిట్ ఎలివేషన్స్ సీన్స్ వెనుక ఒకే వ్యక్తి ఉన్నారు. ఆయనే రాయల హరిశ్చంద్ర. ఈయన చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 

the man behind the super hit elivations..!!
మహేష్ బాబు కెరీర్ లోనే సూపర్ హిట్ అయిన ఒక్కడు చిత్రం లో.. మహేష్ కొండా రెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ ని కొట్టిన సీన్ లో ఒక వ్యక్తి ..”పట్ట పగలు నడి రోడ్డు పైన..కొండా రెడ్డి బురుజు దగ్గర ఓబుల్ రెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడు.. ఎవడ్రా అతను..” అని నటుడు హరిశ్చంద్ర ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ అసలు. అలాగే ఆ తర్వాత బాహుబలి చిత్రం లో అమరేంద్ర బాహుబలి.. రాజా ఆజ్ఞ ను ధిక్కరించి..అనుష్క తో కలిసి కోటను వీడి బయటకు వచ్చే సన్నివేశం లో కూడా ” అరే ఏడుస్తారేంట్రా.. దేవుడు గుడి వదిలి.. మనతో ఉండేందుకు వస్తున్నాడు రా .. పండగ చేసుకోవాలిరా”.. అంటూ ఆయన చెప్పే సీన్ కూడా ఆ చిత్రం లో హైలైట్ గా నిలిచింది.

the man behind the super hit elivations..!!

అలాగే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చిత్రం లో కూడా ఒక సీన్ లో ఆయన కనిపిస్తారు. విలన్స్ లో ఒకరిని మహేష్ కొట్టి తీసుకు వెళ్తుంటే.. ” ఏంటండీ ఈ దారుణం.. పట్ట పగలే కిడ్నాప్ ఆహ్.. ముందు పోలీసులకి ఫోన్ చెయ్యండి..” అనే డైలాగ్ ఆయన చెప్తారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ మూవీ లో కూడా క్లైమాక్స్ లో ఆయన తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఎలివేషన్స్ కి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.