ఈ ఫోటోలో అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి భారత దేశంలోనే గొప్ప నటుడు అయ్యాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి భారత దేశంలోనే గొప్ప నటుడు అయ్యాడు..! ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఒక సమయంలో భారతీయ సినిమా పరిశ్రమలో భాషల పరంగా వేరు వేరు పరిశ్రమలు ఉండడంతో, ప్రతి సినిమాని రీజనల్ సినిమా గా మాత్రమే పరిగణించేవారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాలు అన్నీ ప్రతి భాషలో విడుదల అవ్వడంతో తెలుగు సినిమా, తమిళ్ సినిమా అనే విషయాలని పక్కన పెట్టి భారతీయ సినిమా అని చెప్పడం మొదలు పెట్టారు.

Video Advertisement

ఆస్కార్ తీసుకొచ్చి రాజమౌళి భారతీయ సినిమా అని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడేలా చేశారు. ఒక రకంగా రాజమౌళి ఎంతో మంది దర్శకులకి స్ఫూర్తి ఇచ్చారు.

the person in this picture is hero

దాంతో ప్రతి దర్శకుడు కూడా, తాము రాసే కథ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వకుండా, ప్రతి ఒక్కరూ చూడాలి అనే విధంగా సినిమాలు రూపొందిస్తున్నారు. నటులు కూడా మన సినిమాని భారతదేశం అంతటా చూస్తోంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా ఎక్కువ శ్రమించి ఇండస్ట్రీ పేరు నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని గర్వపడేలా చేసిన ఒక గొప్ప నటుడు. అతను ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.

ఈ ఫోటో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక ఈవెంట్ కి హాజరైనప్పుడు తీసిన ఫోటో. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న వ్యక్తి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ. జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యులు అయిన నందమూరి సుహాసిని గారి ఇంట్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకి హాజరు అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, అలాగే మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు.

ఇప్పుడు మోక్షజ్ఞ తన అన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఇలా కౌగిలించుకున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఇంక సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఒకటి కొడుకు పాత్ర అయితే, ఇంకొకటి తండ్రి పాత్ర అని అంటున్నారు. అందుకే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ లో ఉన్న రెండు లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అని అన్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో నటిస్తారు.

ALSO READ : భక్తి పాటని ఐటెం సాంగ్ చేసారు అని ట్రోల్ చేసారు.. కానీ అసలు కథ ఇది..!


End of Article

You may also like