Ads
భారీ అంచనాల నడుమ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, పూరి దర్శకత్వం లో వచ్చిన చిత్రం లైగర్. ఇషీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను చవి చూసింది. విజయ్ ఇమేజ్…పూరి క్రేజ్ చూసి భారీ మొత్తాలుచెల్లించి రైట్స్ తీసుకున్నారు బయ్యర్లు. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు వరకూ ఈ వ్యవహారం చేరింది.
Video Advertisement
అయితే మరి ఆనాడే రాకింగ్ స్టార్ యశ్ లా విజయ్ తప్పించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదా? అంటే అవుననే కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వస్తుంది. అప్పట్లో యశ్ తో లైగర్ సినిమా చేయడానికి పూరి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఇదే లైగర్ కథని పూరి యశ్ తో తెలుగు-కన్నడ భాషల్లో తెరకెక్కించాలనుకున్నారుట. కానీ కథ నచ్చకపోవడంతో యశ్ అప్పుడు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి.. అప్పుడే కేజీఎఫ్ తో హిట్ కొట్టిన యష్ ని కలిసి లైగర్ కథ చెప్పగా తిరస్కరించారు. తర్వాత పూరి మళ్ళీ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ కథని మహేష్ పక్కన పెట్టేసిన తర్వాత.. ఆ కథని కూడా యష్ కి చెప్పాడట పూరి. కానీ యశ్ మాత్రం మళ్లీ నో అని చెప్పినట్లు తెలుస్తుంది.
యష్ తెలివిగా పూరి రెండు సినిమాల నుంచి తప్పుకోగా విజయ్ దేవరకొండ బుక్ అయ్యాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
End of Article