ఏంటి DSP గారూ..? “దడ దడ” పాటని కూడా కాపీ కొట్టారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

ఏంటి DSP గారూ..? “దడ దడ” పాటని కూడా కాపీ కొట్టారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

by Anudeep

Ads

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సూపర్ హిట్ సంగీతం అందిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవిశ్రీప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ అందరిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

Video Advertisement

1999లో దేవీ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా  సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు.  ఖడ్గం, శంకర్ దాదా ఎంబిబిఎస్, జులాయి, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి చిత్రాలకు సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ అందించారు దేవిశ్రీ ప్రసాద్.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే ప్రతి పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు దేవిశ్రీ హవా కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా ఛాన్స్ లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెంతకు చేరుతున్నాయి.అద్భుతమైన సంగీతం తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు థమన్. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకులకు కావాల్సింది థమన్ మ్యూజిక్ అని నిర్ణయించుకుంటున్నారు. ఈ విధంగా థమన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి దేవిశ్రీప్రసాద్ ఓవర్టేక్ చేస్తూ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసి మరోసారి హిట్ అందుకున్నాడు దేవిశ్రీప్రసాద్.  పుష్ప హిట్ తో దేవిశ్రీ మళ్లీ లైన్ లోకి వచ్చేసాడు అని అందరూ అనుకున్నారు. క్రేజ్ తగ్గిపోతుందనే ఫ్రస్టేషన్ లో ట్యూన్స్ కాపీ చేస్తున్నాడు అంటూ నెటజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే ఉప్పెన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన జల జల జల పాతం పాట ఎంత సక్సెస్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు అదే ట్యూన్ ని అచ్చుగుదినట్లు గా దింపేసాడు దేవిశ్రీప్రసాద్. ఇంతకీ ఆ చిత్రం ఏమిటి అనుకుంటున్నారా.. మన ఎనర్జిటిక్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలోని దడ దడ అనే లిరిక్స్ అచ్చు జల జల జల పాతం ట్యూన్ మాదిరిగానే క్రియేట్ చేశాడు. ఈ లిరిక్స్ తో ఇంత క్రియేటివిటీ లేనట్లు తయారయ్యావు ఏంటి దేవిశ్రీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటజన్లు.


End of Article

You may also like