50 ఏళ్ళు… ఎన్నో సినిమాలు… ఇంత గొప్ప థియేటర్ ని ఎందుకు మూసేశారు..? విషయం ఏంటంటే..?

50 ఏళ్ళు… ఎన్నో సినిమాలు… ఇంత గొప్ప థియేటర్ ని ఎందుకు మూసేశారు..? విషయం ఏంటంటే..?

by kavitha

Ads

సినిమా అనేది ప్రస్తుతం అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఇండియాలోనే రూపొందుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయుల పైన, ముఖ్యంగా తెలుగువారి మీద చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

Video Advertisement

భారత్ లో వేల సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. సినిమాను థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్లే  ప్రతివారం ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రఖ్యాతి గాంచిన థియేటర్లలో బెంగుళూర్ లో తులసి థియేటర్ కూడా ఒకటి. అయితే థియేటర్ మూసివేశారు. ఎందుకు క్లోజ్ చేశారో  ఇప్పుడు చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నో థియేటర్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ది చెందిన థియేటర్లలో బెంగళూరులోని మరతహళ్లి రోడ్ లో ఉన్న తులసి థియేటర్ ఒకటి. ఈ థియేటర్ ప్రారంభించి దాదాపు యాబై సంవత్సరాలు అవుతోంది. ఎన్నో వేల సినిమాలు ఇక్కడ ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటిదాకా లక్షలాది ప్రేక్షకులు ఈ థియేటర్ లో సినిమాలు చూసి ఆనందించించారు. ఇందులో కేవలం కన్నడ సినిమాలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలో తమిళ మరియు తెలుగు సినిమాలు ప్రదర్శితం అయ్యాయి.
కన్నడ ప్రేక్షకులు తమ సినిమాలు ఈ థియేటర్ లో చూసి ఎంత ఆనందిస్తారో, అదే విధంగా కర్ణాటకలో నివసించే తెలుగువారు కూడా తులసి థియేటర్ లో తెలుగు సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని నెలల క్రితం రీరిలీజ్ అయిన తెలుగు సినిమాలకు వెళ్ళిన ఆడియెన్స్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న తులసి థియేటర్ ను శాశ్వతంగా మూసి వేశారు. దానికి కారణం అక్కడి భూమి విలువ 5 రెట్లు పెరగడమే అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కర్నాటక ప్రజలు, అక్కడ ఉండే తెలుగు, తమిళ వాళ్ళు కూడా ఈ థియేటర్ తో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఈ థియేటర్ ని బాగా మిస్ అవుతామని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “సన” ముస్లిం అయినా అమ్మవారిని నమ్ముతారా..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like