ఇప్పుడు ఉన్న టైంలో ఎంతోమంది ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. టైం కి ఆహారం తీసుకోవడం, అది కూడా ట్రైనర్ చెప్పినవి మాత్రమే తీసుకోవడం, రోజు వర్కవుట్ చేయడం, లేదా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఫిట్ నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే వారిలో ముందు ఉండేది సినిమా నటులు. వారి డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.

Video Advertisement

మన హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కానీ, లేదా ఇంకా దేని వల్ల అయినా కానీ కొంత మంది హీరోయిన్లు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అయితే వారిలో కొంత మంది బక్కగా అయినప్పటికంటే కొంచెం బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నారు అని సోషల్ మీడియాలో అంటూ ఉంటారు. అలా బక్కగా అయిన తర్వాత సోషల్ మీడియాలో డిస్కషన్ లో ఉన్న కొంత మంది హీరోయిన్లు వీరే.

#1 రకుల్ ప్రీత్ సింగ్

heroines who got trolled for becoming skinny

స్పైడర్ సినిమా తర్వాత హిందీలో ఆయ్యారీ సినిమా చేశారు రకుల్. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రకుల్ చాలా సన్నగా కనిపించారు. కానీ తర్వాత ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ తగ్గినట్లు చెప్పారు.

#2 కీర్తి సురేష్

heroines who got trolled for becoming skinny

కీర్తి సురేష్ కూడా మహానటి, సర్కార్, సామి స్క్వేర్ తర్వాత చాలా సన్నగా అయ్యారు. ముఖ్యంగా పెంగ్విన్ సినిమాలో అయితే కీర్తి సురేష్ ని చూసిన వాళ్ళందరూ “ఏమైంది కీర్తికి ఇంత సన్నగా అయ్యారు?” అని అనుకున్నారు.

#3 రాశి ఖన్నా

heroines who got trolled for becoming skinny

రాశి ఖన్నా కూడా 2018 లో విడుదలైన తొలి ప్రేమ సినిమాలో చాలా సన్నగా ఉన్నారు. రాశి కూడా తన వర్కౌట్ కి సంబంధించిన వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

#4 షాలిని పాండే

heroines who got trolled for becoming skinny

తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు షాలిని పాండే. అయితే షాలిని పాండే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పిక్చర్స్ పోస్ట్ చేశారు. అందులో చాలా సన్నగా కనిపిస్తున్నారు. దాంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో కొంత డిస్కషన్ జరిగింది. ఎంతో మంది నెటిజన్లు “బక్కగా అయ్యారు ఏంటి?” అని కామెంట్ చేశారు.